టీజీపీఎస్సీ కార్యాలయం ముందు జనసేన నేత భీమ నరేందర్ రెడ్డి ఆందోళన.. ఉద్యోగాల భర్తీపై రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీత
హైదరాబాద్‌లోని టీజీపీఎస్సీ కార్యాలయం ముందు జనసేన నేత భీమ నరేందర్ రెడ్డి నిరసనకు దిగారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, ప్రభుత్వం ప్రకటిస్తున్న ఉద్యోగాల భర్తీ గణాంకాలపై స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య అధికంగా ఉందని, యువతలో నిరుద్యోగ శాతం 8.9 శాతంగా ఉందని…

