ఒలింపిక్స్లో కబడ్డీని చూడటమే లక్ష్యం.. రగ్బీని మించి ఎదగాలి: కెన్యా కబడ్డీ ప్రతినిధి జేమ్స్ అకామా
హైదరాబాద్: కబడ్డీని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించి, భవిష్యత్లో ఒలింపిక్స్లో చోటు దక్కే స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని కెన్యాకు చెందిన కబడ్డీ ప్రతినిధి జేమ్స్ అకామా అన్నారు. హైదరాబాద్లో జరుగుతున్న అంతర్జాతీయ కబడ్డీ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్కు వచ్చిన ఆయన.. కబడ్డీ అభివృద్ధి, అంతర్జాతీయ సహకారం, కెన్యాలో ఆ క్రీడ పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. హైదరాబాద్కు రావడం ఇదే తొలిసారి భారత్కు రావడం తనకు ఇదేమీ మొదటిసారి కాదని జేమ్స్ అకామా తెలిపారు. గతంలో 2012,…

