హైదరాబాద్ సైదాబాద్ ప్రైవేట్ స్కూల్ వివాదం.. రెండో తరగతి విద్యార్థికి ‘కల్మా’ హోంవర్క్ ఇచ్చారనే ఆరోపణలు, విచారణకు డిమాండ్
హైదరాబాద్‌లోని సైదాబాద్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. రెండో తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థి హోంవర్క్ డైరీలో ‘కల్మా’ మరియు ‘సురా ఫాతిహా’ చదివి రావాలని సూచించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. తల్లిదండ్రుల కథనం ప్రకారం, పిల్లవాడి హోంవర్క్ డైరీని పరిశీలించిన సమయంలో ఈ సూచనలు కనిపించాయి. వెంటనే వారు పాఠశాల యాజమాన్యాన్ని కలిసి వివరణ కోరారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం…

