తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలు.. సెప్టెంబర్లో ఓటరు నమోదు
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్, వరంగల్–ఖమ్మం–నల్గొండ నియోజకవర్గాల్లో సెప్టెంబర్ చివరి వారంలో ఓటరు నమోదు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండగా, ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై దృష్టి సారించాయి. తెలంగాణలో మరోసారి రాజకీయ వేడి పెరగనుంది. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికల సన్నాహాలు…

