డైట్ కళాశాలల్లో 86 లెక్చరర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్.. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అంటూ అభ్యర్థుల ప్రశ్న
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) మరో ఉద్యోగ నోటిఫికేషన్ను విడుదల చేసింది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలు (డైట్ కళాశాలలు)లో ఖాళీగా ఉన్న 86 లెక్చరర్ పోస్టుల భర్తీకి గురువారం అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 23 సీనియర్ లెక్చరర్ పోస్టులు, 63 లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. టీజీపీఎస్సీ కార్యదర్శి హరిత విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 24వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ…

