5 లక్షల కోట్ల భూ స్కామ్ నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకూ – కాంగ్రెస్ సర్కార్‌పై చీకోటి ప్రవీణ్ సంచలన ఆరోపణలు
తెలంగాణలో భారీ స్థాయిలో 5 లక్షల కోట్ల భూ స్కామ్ నడుస్తోందని హిందుత్వవాది చీకోటి ప్రవీణ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇండస్ట్రియల్ భూములను ఔటర్ రింగ్ రోడ్ అవతలికి తరలించే నెపంతో డబుల్ రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకువచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాఫియాకు దారితీసిందని ఆయన విమర్శించారు. ఇండస్ట్రియల్ భూములను రెసిడెన్షియల్‌గా మార్చుకునే వెసులుబాటు వెనుక పెద్ద ఎత్తున భూ దందా జరుగుతోందన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ అవసరాల కోసమే ఈ స్కామ్‌ల ద్వారా డబ్బులు వసూలు…

