మీనాక్షి నటరాజన్‌కు కోర్టుల్లో షాక్.. రాజ్యసభ నామినేషన్ వివాదం రాజకీయ దుమారం

కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్‌కు వరుసగా న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగలడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై దాఖలైన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు విచారణకు అనర్హమని పేర్కొంటూ కొట్టివేయగా, మరోవైపు నాంపల్లి కోర్టు కూడా ఇదే అంశంపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల సంఘం తీరుపై, రాజకీయ పార్టీల అంతర్గత వ్యవహారాలపై తీవ్ర చర్చ మొదలైంది….

Read Full News

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు భారీ ఊరట.. ఆ రెండు కేసుల్లో వ్యక్తిగత హాజరుకు హైకోర్టు మినహాయింపు

హైదరాబాద్: సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా పేరుగాంచిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ)కి తెలంగాణ హైకోర్టులో కీలక ఊరట లభించింది. గత ఎనిమిదేళ్లుగా ఆయనను వెంటాడుతున్న రెండు క్రిమినల్ కేసుల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నాంపల్లి కోర్టులో విచారణలో ఉన్న కేసులకు సంబంధించి తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. హైకోర్టులో ఆర్జీవీకి బిగ్ రిలీఫ్ నాంపల్లిలోని మూడో అదనపు చీఫ్…

Read Full News

పరువునష్టం దావా విచారణలో కొండా సురేఖపై కోర్టు హెచ్చరిక — నాన్-బైలబుల్ వారెంట్ అవకాశం

పరువునష్టం దావా విచారణలో భాగంగా నాంపల్లి కోర్టు మంత్రి కొండా సురేఖకు కీలకమైన సూచనలు చేసింది. విచారణకు పలుమార్లు వ్యక్తిగతంగా హాజరు కాకపోవడంతో కోర్టు అసహనం వ్యక్తం చేస్తూ, అవసరమైతే నాన్-బైలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశాన్ని కూడా సూచించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది. కేటీఆర్ దాఖలు చేసిన పరువునష్టం దావా నేపథ్యంలో ఈ కేసు నడుస్తోంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాను చేసిన వ్యాఖ్యలు తప్పు కాదని, ప్రచారంలో…

Read Full News