సోనం వాంగ్‌చుక్‌ను హీరో చేశారు’.. విద్యార్థి ఉద్యమం రాజకీయాల వైపు వెళ్తుందా? ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై చర్చ
విద్యా వ్యవస్థలో పెరుగుతున్న పేపర్ లీకులు, పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తు వంటి అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న వేళ, లడఖ్‌కు చెందిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. వాంగ్‌చుక్‌ను నిర్బంధించి జైలుకు పంపడం వల్ల ఆయన దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందారని, ప్రభుత్వ వైఖరే ఆయనను హీరోగా మార్చిందని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలో అవినీతికి…

