“ప్రజలు కాదు సీఎం మారాలి” – రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు
తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రీట్రీట్ 2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి Revanth Reddy చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ప్రజల ప్రవర్తనలో మార్పు రావాలని, నేరాల స్వరూపం మారుతున్న నేపథ్యంలో పోలీసు వ్యవస్థ కూడా అప్గ్రేడ్ కావాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. అమెరికాకు వెళ్తే మనం ఒక విధంగా ప్రవర్తిస్తామని, కానీ భారతదేశంలో అదే క్రమశిక్షణ పాటించమని ఆయన ఉదాహరణ ఇచ్చారు. అక్కడ వాటర్ బాటిల్‌ను డస్ట్‌బిన్‌లో వేస్తామని, కానీ ఇక్కడ రోడ్ల…

