కాంగ్రెస్‌లో 18 ఏళ్ల ప్రస్థానం.. రేవంత్ రెడ్డి నాయకత్వంపై మాజీ నేత తీవ్ర విమర్శలు
ఆదిలాబాద్: 2006లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పిలుపుతో ఎన్‌ఎస్‌యూఐ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించానని, దాదాపు రెండు దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేశానని ఆదిలాబాద్‌కు చెందిన మాజీ కాంగ్రెస్ నేత తెలిపారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, పార్టీ నాయకత్వం వ్యవహరించిన తీరు తనను తీవ్రంగా బాధించాయని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతున్న పాలనపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తాను ఈ ప్రభుత్వంలో భాగస్వామిని కాకపోవడం…

