కరోనా తర్వాత మరో వైరస్ భయం? అట్లాంటిక్ క్రూయిజ్ షిప్లో హంటా వైరస్ కలకలం.. అసలు ఈ వైరస్ ఎంత ప్రమాదకరం?
ప్రపంచాన్ని ఒకప్పుడు కరోనా వైరస్ వణికించినట్లే ఇప్పుడు మరో వైరస్ పేరు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. అదే హంటా వైరస్. అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న ఓ క్రూయిజ్ షిప్లో ఈ వైరస్ కేసులు వెలుగులోకి రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ముగ్గురు మరణించగా మరికొంతమంది అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వివరాల ప్రకారం, డచ్ సంస్థకు చెందిన MV Hondius అనే క్రూయిజ్ నౌకలో హంటా వైరస్‌కు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఈ…

