పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ నిర్ణయంపై వివాదం – జగిత్యాల ఎమ్మెల్యేపై కవిత ప్రశ్నలు, జీవన్ రెడ్డి కౌంటర్
పార్టీ ఫిరాయింపుల అంశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు స్పీకర్ క్లీన్ షీట్ ఇవ్వడంపై రాజకీయ దుమారం చెలరేగింది. ఈ నిర్ణయం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కలవకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. బుధవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఆమె, స్పీకర్ కాంగ్రెస్ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గాంధీ భవన్‌కు వెళ్లి కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొన్న విషయం స్పీకర్‌కు తెలియదా అని కవిత ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో…

