కళ్యాణలక్ష్మి చెక్కులు ఎమ్మెల్యేలు ఎలా ఇస్తారు? అధికారులపై హైకోర్టు కీలక ప్రశ్నలు

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల విషయంలో రాజకీయ నేతల జోక్యంపై హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యేల పాత్ర ఏంటి? అంటూ ధర్మాసనం కీలక ప్రశ్నలు సంధించింది. లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించాల్సిన బాధ్యత అధికారులదేనని, అలాంటప్పుడు ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేయడం ఎందుకని ప్రశ్నించింది. ఎమ్మెల్యేలు చెక్కులు ఎలా పంపిణీ చేస్తారు? కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ప్రభుత్వం అర్హులైన…

Read Full News

ఉద్యోగులకు ఉచిత జీవిత బీమా.. అమలే అసలు సవాల్ అంటున్న ఉద్యోగ సంఘాలు

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు ఉచిత జీవిత బీమా పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ప్రమాదవశాత్తు ఉద్యోగి మరణిస్తే కుటుంబానికి రూ.1.20 కోట్ల వరకు బీమా రక్షణ కల్పించే ప్రతిపాదనపై ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ మేరకు ప్రముఖ బ్యాంకులతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నిర్ణయాన్ని ఉద్యోగ వర్గాలు స్వాగతిస్తున్నప్పటికీ, అమలుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య కార్డులు,…

Read Full News