నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్.. విద్యా వ్యవస్థలో సంస్కరణలే లక్ష్యమంటున్న విద్యార్థులు
దేశవ్యాప్తంగా నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారం మరోసారి రాజకీయ, సామాజిక చర్చకు దారితీసింది. పరీక్షల పారదర్శకతపై ప్రశ్నలు తలెత్తడంతో పాటు, విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నీట్ పేపర్ లీక్ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్…

