తెల్లవారుజామున కూల్చివేతలు.. పేద మహిళ కన్నీటి ఆవేదన!

రోడ్డుపక్కన జీవనం సాగిస్తూ, రోజువారీ కష్టంతో కుటుంబాలను పోషించుకునే పేదలపై మున్సిపల్ అధికారుల చర్యలు తీవ్ర ఆవేదనకు దారితీశాయని ఓ మహిళ కన్నీటిపర్యంతమవుతూ తన గోడును వెళ్లబోసుకుంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండా తెల్లవారుజామున వచ్చి తమ జీవనాధారాలను కూల్చివేశారని ఆరోపించింది. తమకు కొంత సమయం ఇచ్చి ఉంటే స్వయంగా తొలగించుకునేవారమని, ప్రత్యామ్నాయ స్థలం చూపించినా అక్కడికి వెళ్లేవారమని వేడుకుంది. “మా బతుకులు ఎలా సాగాలి?” “మేము ఏం పాపం చేశాం? మాకు చెప్పకుండా అర్ధరాత్రి దొంగల్లా వచ్చి…

Read Full News

50 ఏళ్లుగా అమీర్‌పేటలోనే ఉంటున్నాం.. ఇల్లు మాత్రం రాలేదు! కాంగ్రెస్ వచ్చాక మార్పు ఏంటి?

హైదరాబాద్ అమీర్‌పేటలో పేదల పరిస్థితిపై గ్రౌండ్ రియాలిటీ ఏంటి? డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నామని స్థానిక మహిళ ఆవేదన. కేసీఆర్ ప్రభుత్వంలో దరఖాస్తు చేసినా ఇల్లు రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎదురుచూపులు తప్పడం లేదని వ్యాఖ్య. హైదరాబాద్ అంటే అభివృద్ధికి మారుపేరు. భారీ రోడ్లు, మెట్రో, కమర్షియల్ భవనాలు, కొత్త నిర్మాణాలు.. నగరం రోజురోజుకూ రూపురేఖలు మార్చుకుంటోంది. కానీ ఇదే హైదరాబాద్‌లో కొన్ని కుటుంబాలు మాత్రం దశాబ్దాలుగా సొంత ఇంటి…

Read Full News

నిత్యావసర ధరల మంట.. సామాన్యుడి జేబు గుల్ల చేస్తున్న ఖర్చులు ఎవరి విధానం?

ఒక గ్యాస్ సిలిండర్ ధర రూ.1,100.. లీటర్ వంట నూనె రూ.195.. కిలో బియ్యం రూ.70.. పంచదార రూ.70.. ఈ ధరలు వింటుంటే సామాన్యుడికి గుండెల్లో మంట పుట్టదా? రోజంతా చెమటోడ్చి సంపాదించిన డబ్బు ఇంటి ఖర్చులకే సరిపోని పరిస్థితి వస్తే మధ్యతరగతి, పేద కుటుంబాలు ఎలా బతకాలి? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనిషి ఉపయోగించే ప్రతి వస్తువుపై ధరల ప్రభావం కనిపిస్తోంది. ఇది కేవలం కొన్ని వస్తువుల ధరల సమస్య…

Read Full News

మూసాపేటలో సమస్యలు ఎక్కడికక్కడే.. నీళ్లు, ఇళ్లు, పెన్షన్లపై స్థానికుల ఆవేదన

హైదరాబాద్‌లోని మూసాపేట ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్థానికులతో మాట్లాడగా భిన్నమైన అభిప్రాయాలు, సమస్యలు వెలుగులోకి వచ్చాయి. కొందరు ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు నీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజీ, ఇళ్ల సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు రోజులకు ఒకసారి నీళ్లు మూసాపేటలో ప్రధానంగా నీటి సమస్య ఉందని కొందరు స్థానికులు చెబుతున్నారు. రెండు రోజులకు ఒకసారి, మూడు రోజులకు ఒకసారి మాత్రమే నీళ్లు…

Read Full News

ప్రతి కుటుంబానికి ఎకరం భూమి.. కవిత సంచలన హామీ | Telangana Bhoomilakshmi Scheme

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక హామీ చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ‘భూలక్ష్మి’ పథకాన్ని ప్రతిపాదించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి పంపిణీ చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత.. తెలంగాణలో సామాజిక న్యాయం సాధించాలంటే భూమి పంపిణీ అవసరమని అన్నారు. భూమి లేని పేద కుటుంబాలకు భూమి అందించడం ద్వారా…

Read Full News

బోయినపల్లి భూముల వ్యవహారంపై బీఆర్ఎస్ ఆందోళన.. బాధితులకు న్యాయపోరాటం చేస్తామని హామీ

బోయినపల్లి ప్రాంతంలో నివసిస్తున్న పేద కుటుంబాల గృహ సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం కోసం కేటాయిస్తామని ప్రకటించిన భూమి ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోకి వెళ్లిందని ఆరోపిస్తూ బాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు, బోయినపల్లిలో సుమారు ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిలో 6,000 ఇంద్రమ్మ ఇళ్లు నిర్మిస్తామని ప్రజాప్రతినిధులు గతంలో ప్రకటించారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఆ భూమిపై ప్రైవేటు వ్యక్తులు హక్కులు చెలాయిస్తున్నారని,…

Read Full News

ఇళ్లు కూల్చివేతలతో రోడ్డున పడిన పేద కుటుంబాలు – డయాలిసిస్ రోగితో కన్నీటి కథ

ఇళ్లు కూల్చివేతలతో పేద కుటుంబాలు రోడ్డున పడిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బాధితులు కన్నీళ్లతో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. “మేము గరీబులం… మా ఇళ్లు కూల్చేస్తే ఎక్కడికి పోవాలి?” అని ఒక మహిళ వేదన వ్యక్తం చేసింది. ఆమె భర్త డయాలిసిస్ పేషెంట్ అని, ఈ టెన్షన్ వల్ల ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. “ఇంత టెన్షన్ లో ఆయన చచ్చిపోతే నేను ఏమవుతాను?” అని కన్నీటి పర్యంతమైంది. ఇళ్లు…

Read Full News