బాల్క సుమన్‌పై అక్రమ కేసులు: ప్రభుత్వం ప్రతిపక్ష గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది – బీఆర్ఎస్ నేతల విమర్శ
హైదరాబాద్: మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై నమోదు చేసిన కేసులు రాజకీయ కక్షసాధింపులో భాగమేనని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. చంచల్‌గూడ జైలులో నిర్బంధంలో ఉన్న బాల్క సుమన్‌ను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తదితరులు కలిసి బాల్క సుమన్‌ను ములాఖత్‌లో కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ, సుమన్‌పై…

