పుబర్టీ నుంచి మెనోపాజ్ వరకు మహిళల ఆరోగ్య సమస్యలకు హోమియోపతీ ఎంతవరకు ఉపయోగపడుతుంది? నిపుణులు చెప్పిన కీలక విషయాలు
హైదరాబాద్: మహిళల జీవితంలో పుబర్టీ నుంచి మెనోపాజ్ వరకు అనేక హార్మోన్ల మార్పులు, ఆరోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. మొటిమలు, హెయిర్ ఫాల్, పీరియడ్స్ సమస్యలు, పీసీఓఎస్, గర్భధారణ ఇబ్బందులు, మెనోపాజ్ లక్షణాలు వంటి అనేక సమస్యల్లో హోమియోపతీ చికిత్స ఉపయోగపడుతుందని హెల్త్ నిపుణులు చెబుతున్నారు. నిపుణుల ప్రకారం, హోమియోపతీని పుట్టిన శిశువు నుంచి వృద్ధాప్యం వరకు, అవసరాన్ని బట్టి ఉపయోగించవచ్చు. ముఖ్యంగా మహిళల్లో వచ్చే సమస్యలకు హార్మోన్లను కృత్రిమంగా ఇవ్వకుండా, శరీర సమతుల్యతను మెరుగుపరిచే విధంగా చికిత్స…

