బస్తీలో కుస్తీలు: రహమత్ నగర్లో డ్రైనేజీ దుర్భరం.. మంచినీటి కోసం నిరీక్షణ.. సీఎన్ రెడ్డి పనితీరుపై ప్రజల మిశ్రమ స్పందన
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా ప్రజల నుంచే తెలుసుకునే ఓకే టీవీ ప్రత్యేక కార్యక్రమం “బస్తీలో కుస్తీలు” ఈసారి రహమత్ నగర్ డివిజన్‌కు చేరుకుంది. ఇప్పటికే యూసుఫ్‌గూడ, బోరబండ ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమం తర్వాత రహమత్ నగర్లో స్థానిక ప్రజల అభిప్రాయాలను సేకరించారు. ప్రధానంగా రహమత్ నగర్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, మురుగు నీటి సమస్యలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయని స్థానికులు తెలిపారు. మరోవైపు, మాజీ కార్పొరేటర్ సీఎన్…

