మౌలాలి బస్తీల్లో ప్రజల ఆవేదన.. కార్పొరేటర్ కనిపించట్లేదని ఆరోపణలు, రోడ్లు-డ్రైనేజీ-నీటి సమస్యలపై స్థానికుల అసంతృప్తి
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని మౌలాలి డివిజన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఓకే టీవీ నిర్వహిస్తున్న “బస్తీలో కుస్తీలు” కార్యక్రమం ఈసారి మౌలాలి ప్రాంతానికి చేరుకుంది. స్థానికులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలు, అభివృద్ధిపై వారి అంచనాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా పలువురు స్థానికులు రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, దోమల నివారణ, కార్పొరేటర్ అందుబాటు, అలాగే మైనారిటీలకు సంబంధించిన కబ్రస్తాన్ సమస్యలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. కమాన్ విస్తరణతో ట్రాఫిక్ సమస్య…

