తెలంగాణవాదం ప్రాంతీయవాదం కాదు, జాతీయవాదమే: బీఆర్ఎస్ నేతల స్పష్టీకరణ
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమాన్ని ప్రాంతీయవాదంగా అభివర్ణించే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ నేతలు స్పందించారు. తెలంగాణ చరిత్ర, ఉద్యమ నేపథ్యం, రాష్ట్ర ఆవిర్భావ పోరాటాన్ని వక్రీకరించే వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరించారు. వారి ప్రకారం, 1953లో మద్రాసు రాష్ట్రం నుంచి భాషా ప్రాతిపదికన విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం కూడా ప్రాంతీయ ఆకాంక్షల ఫలితమేనని పేర్కొన్నారు. అలాంటప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని మాత్రమే ప్రాంతీయవాదంగా చిత్రీకరించడం సరైనది కాదన్నారు. తెలంగాణ చరిత్రను ప్రస్తావిస్తూ, 1948 వరకు హైదరాబాద్ సంస్థానం ప్రత్యేక…

