22A నిషేధిత జాబితాపై రైతుల ఆందోళన.. పట్టా భూములను మళ్లీ ఎందుకు చేర్చారంటూ ప్రశ్నలు
హైదరాబాద్: తెలంగాణలో భూ రికార్డుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ధరణి పోర్టల్ సమయంలో ఎదురైన భూ సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై.. ప్రస్తుతం 22A నిషేధిత జాబితా విషయంలో రైతులు, భూ యజమానులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పట్టా భూములుగా కొనసాగుతున్న భూములను మళ్లీ నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. పాత పట్టా భూములకు కొత్త చిక్కులు? రైతులు, భూ యజమానుల…

