వర్షాల కోసం వరుణ యాగం.. రైతుల కష్టాలపై ప్రశ్నలు!
కృష్ణమ్మ చెంత వేద మంత్రాల ఘోష.. సీఎం దంపతుల పూర్ణాహుతి తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలు పుష్కలంగా పండాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్‌లోని కృష్ణా నది తీరంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వరుణ యాగం వైభవంగా జరిగింది. వేద మంత్రాల ఘోష మధ్య నిర్వహించిన ఈ యాగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి, కొండా సురేఖతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు…

