టీజీ టెట్ ఫలితాలు నేడు.. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులపై రాష్ట్రవ్యాప్త ఆడిట్‌కు కమిటీ ఏర్పాటు

తెలంగాణలో విద్యార్థులు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు టీజీ టెట్ (TG TET) జూన్-2026 పరీక్షల ఫలితాలను నేడు మధ్యాహ్నం 2:30 గంటలకు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించగా, మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవస్థపై సమగ్ర ఆడిట్ నిర్వహించేందుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. నేడు టీజీ టెట్ ఫలితాలు జూన్ 16 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు 10…

Read Full News

డైట్ కళాశాలల్లో 86 లెక్చరర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్.. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు అంటూ అభ్యర్థుల ప్రశ్న

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ పరిధిలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలు (డైట్ కళాశాలలు)లో ఖాళీగా ఉన్న 86 లెక్చరర్ పోస్టుల భర్తీకి గురువారం అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 23 సీనియర్ లెక్చరర్ పోస్టులు, 63 లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. టీజీపీఎస్సీ కార్యదర్శి హరిత విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 24వ తేదీ నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ…

Read Full News

విద్యారంగంలో కార్పొరేట్ పెత్తనానికి వ్యతిరేకంగా ఏబీవీపీ ఆందోళన.. స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ ముట్టడి

తెలంగాణలో విద్యారంగ సమస్యలపై అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) కార్యకర్తలు తీవ్ర ఆందోళన చేపట్టారు. హైదరాబాద్‌లోని స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత, కార్పొరేట్ విద్యాసంస్థల పెత్తనం, ఫీజుల నియంత్రణ లేకపోవడం, మౌలిక సదుపాయాల కొరత వంటి అంశాలపై ఏబీవీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీవీపీ నాయకుల ఆరోపణల ప్రకారం, రాష్ట్రంలో ఒకప్పుడు సుమారు 27 వేల ప్రభుత్వ పాఠశాలలు…

Read Full News

ఫీజుల దోపిడీపై బీఆర్ఎస్ ముట్టడి.. ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణ చట్టం తీసుకురావాలని తల్లిదండ్రుల డిమాండ్

ఫీజుల దోపిడీపై బీఆర్ఎస్ ముట్టడి.. ప్రైవేట్ విద్యాసంస్థలపై నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. తల్లిదండ్రుల సమస్యలను పట్టించుకోకుండా పోలీసులు వ్యవహరించారని, మహిళల పట్ల కూడా దౌర్జన్యంగా ప్రవర్తించారని తెలంగాణ రక్షణ సేన నేతలు తీవ్రంగా విమర్శించారు. “మహిళలను కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించడం దారుణం. ప్రతి వర్గానికి ఈ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతోంది. రేపు అధికారంలోకి వచ్చేది…

Read Full News

జూన్ 15 నుంచి పాఠశాలలు ప్రారంభం.. 2026-27 అకాడమిక్ క్యాలెండర్ విడుదల.. ప్రీ-ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలకు మార్గదర్శకాలు జారీ

తెలంగాణ రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. వరుస సెలవుల నేపథ్యంలో పాఠశాలల ప్రారంభ తేదీని జూన్ 15గా నిర్ణయించారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా ఉత్తర్వులు జారీ చేశారు. విద్యాశాఖ విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం కొత్త విద్యా సంవత్సరంలో మొత్తం 227 పని దినాలు ఉండనున్నాయి. 2027 ఏప్రిల్ 23ను చివరి పని దినంగా నిర్ణయించగా, అనంతరం ఏప్రిల్ 24 నుంచి జూన్ 13…

Read Full News

ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ ఖాళీలు పెరుగుతున్నాయి – 3500 పోస్టుల సర్దుబాటుకు విద్యాశాఖ ఆదేశాలు

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం ఉపాధ్యాయ ఖాళీలు తీవ్రంగా పెరిగినట్టు సమాచారం. ఇటీవల జరిగిన పదోన్నతుల ప్రక్రియలో దాదాపు 3500 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGTs) ఉన్నత స్థానాలకు ప్రమోషన్ పొందడంతో, ప్రాథమిక స్థాయిలో టీచర్ల కొరత మరింతగా కనిపిస్తోంది. విద్యాశాఖ నివేదికల ప్రకారం, 13 జిల్లాల్లో ప్రాథమిక ఉపాధ్యాయుల కొరత అత్యధికంగా ఉందని అధికారులు గుర్తించారు. పలు పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు రెండు లేదా మూడు తరగతులకు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది….

Read Full News