కడియం శ్రీహరికి తెలంగాణ రక్షణ సేన నేత సవాల్.. ‘రూ.1400 కోట్లు ఎక్కడ ఖర్చు చేశారు?’”
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్‌ఎన్) పార్టీ జెండా పండుగ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకుడు అధికార పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక మహిళ కొత్త రాజకీయ పార్టీని స్థాపించడం చారిత్రాత్మకమని అన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై పార్టీకి ఆశీర్వాదం అందించారని పేర్కొంటూ, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 33 జిల్లాల్లో జెండా పండుగలు నిర్వహించి, 100కు పైగా నియోజకవర్గాల్లో…

