తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్మాణంలో తీవ్ర జాప్యం.. 94 పాఠశాలలకు ఇంకా అనుమతులు పెండింగ్!

తెలంగాణలో పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిపాదించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. కొత్త పాఠశాలల నిర్మాణానికి స్థలాల సేకరణ, నిధుల కేటాయింపు, పరిపాలనా అనుమతులు వంటి అంశాలు సవాళ్లుగా మారడంతో వచ్చే విద్యా సంవత్సరంలోగా అన్ని పాఠశాలలను అందుబాటులోకి తీసుకురావడం కష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 95 పాఠశాలల…

Read Full News

గురుకుల టెండర్లపై అజారుద్దీన్ క్లారిటీ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై విద్యార్థుల ఆందోళన

గురుకుల టెండర్లపై అజారుద్దీన్ క్లారిటీ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై విద్యార్థుల ఆందోళన హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల టెండర్లలో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను రాష్ట్ర మంత్రి అజారుద్దీన్ ఖండించారు. గురుకుల టెండర్లలో ఎలాంటి స్కామ్ జరగలేదని, ప్రతిపక్ష పార్టీ ప్రజల దృష్టిని మళ్లించేందుకు నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన “మంత్రులతో ముఖాముఖి” కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొస్తూ విద్యకు…

Read Full News

జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో వివాదాలు… ఇంచార్జ్ వీసీ టి. గంగాధర్పై తీవ్ర ఆరోపణ

హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో పరిపాలనా వ్యవహారాలపై తీవ్ర వివాదాలు నెలకొన్నాయి. ఇంచార్జ్ వైస్ ఛాన్సలర్‌గా కొనసాగుతున్న టి. గంగాధర్ వ్యవహార శైలిపై ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నట్లు సమాచారం. వర్సిటీలో నియామకాలు, పదోన్నతులు, పాలనా నిర్ణయాలు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు ప్రమోషన్లు ఇవ్వడం, సీనియారిటీ ఉన్న ఫ్యాకల్టీని పక్కన పెట్టడం, అర్హతలు లేని వారికి కీలక బాధ్యతలు అప్పగించడం వంటి…

Read Full News

హార్వార్డ్‌లో సీఎం ఖరీదైన చదువులు… గురుకులాల్లో పాముకాట్లు: విద్యాశాఖ వైఫల్యంపై హరీష్ రావు ఘాటు విమర్శలు

తెలంగాణలో గురుకుల విద్యార్థుల దయనీయ పరిస్థితిపై మాజీ మంత్రి టి.హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా ఇనుగుర్తి గురుకులంలో ఇంటర్ విద్యార్థిని అశ్మిత పాముకాటుకు గురైన ఘటనపై స్పందించిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డి పాలనలో విద్యాశాఖ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి హార్వార్డ్ యూనివర్సిటీకి వెళ్లి విదేశాల్లో ఫోటోలకు ఫోజులు ఇస్తుంటే, ఇక్కడ గురుకులాల్లో చదువుతున్న పేద విద్యార్థులు పాముకాట్లతో, కుక్కకాట్లతో ఆసుపత్రుల పాలవుతున్నారని హరీష్ రావు ఎక్స్…

Read Full News