రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలపై రేవంత్ ఫోకస్.. నిరుద్యోగుల వద్దకు సీఎం, రాహుల్ వెళ్లాలంటూ డిమాండ్!

హైదరాబాద్: తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ అభ్యర్థులు తప్పనిసరిగా గెలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీ అధ్యక్షులకు సూచించారు. మంగళవారం ఢిల్లీలో అందుబాటులో ఉన్న పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ అంశాలపై చర్చించారు. రెండు గ్రాడ్యుయేట్ స్థానాల్లో కాంగ్రెస్…

Read Full News

పోలీసు నియామకాలపై రాజకీయ రగడ.. 7,437 పోస్టులే ఎందుకు? 19 వేల ఖాళీలపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలా?

తెలంగాణలో పోలీసు నియామకాల అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 7,437 పోలీసు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, ఈ నియామక ప్రక్రియకు భంగం కలిగించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు, ఇతర శక్తులు ప్రయత్నిస్తున్నాయని నిఘా వర్గాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించి, నియామక ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్వహించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి…

Read Full News

సరూర్‌నగర్‌లో నిరుద్యోగుల ఆగ్రహం.. ఉద్యోగాల హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసిన వక్త

హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ వేదికగా నిర్వహించిన నిరుద్యోగుల సభలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఎన్నికల హామీలు, యూత్ డిక్లరేషన్ అమలు వంటి అంశాలపై తీవ్ర విమర్శలు వినిపించాయి. సభలో మాట్లాడిన వక్త కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ప్రశ్నించారు. వక్త మాట్లాడుతూ, ఎన్నికల ప్రచార సమయంలో సరూర్‌నగర్ వేదికపైనే కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ప్రకటించిందని గుర్తు చేశారు….

Read Full News