₹20 లక్షల లంచం కేసులో తహసీల్దార్, సర్వేయర్ అరెస్ట్.. భూ సర్వేలపై మళ్లీ చర్చ!

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో రూ.20 లక్షల లంచం కేసు ప్రభుత్వ రెవెన్యూ వ్యవస్థలో అవినీతి అంశాన్ని మరోసారి చర్చకు తీసుకొచ్చింది. HMDA పరిధిలోని ఒక లేఅవుట్‌కు సంబంధించి జాయింట్ ఇన్‌స్పెక్షన్ సర్వే నిర్వహించి నివేదిక ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై మండల సర్వేయర్ బటుక శ్రీనివాసులు, తహసీల్దార్ బి. సుదర్శన్ రెడ్డిని అవినీతి నిరోధక శాఖ (ACB) అరెస్ట్ చేసింది. ఈ కేసులో సర్వేయర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారని, డబ్బులు తహసీల్దార్ సూచనల…

Read Full News

గోవాలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. తెలంగాణలో నిరుద్యోగులపై లాఠీచార్జి సంగతేంటి?

గోవా రాజకీయ వేదికపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీస్తున్నాయి. రాహుల్ గాంధీ తరఫున గోవాకు వెళ్లిన ఆయన.. బీజేపీ ప్రభుత్వంపై డ్రగ్స్, భూవివాదాల అంశాల్లో తీవ్ర విమర్శలు చేశారు. అయితే, గోవాలో నిరుద్యోగుల సమస్యలు, డ్రగ్స్‌పై మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏం సమాధానం చెబుతారంటూ ప్రతిపక్షాలు ప్రశ్నించే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. రాహుల్ గాంధీ సందేశంతో గోవాకు రేవంత్ గోవాలోని…

Read Full News

22A జాబితాపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. వివాదం లేని భూములకు విముక్తి? ఈ వారంలోనే కొత్త లిస్ట్!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భూములు, ఇళ్లు, ఫ్లాట్లు, ప్రైవేట్ ఆస్తులను నిషేధిత ఆస్తుల జాబితా 22Aలో చేర్చడంతో తలెత్తిన వివాదానికి త్వరలోనే పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు 22A జాబితాను సమీక్షించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే సవరించిన జాబితాను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సీఎం ఆదేశాలతో 22A జాబితాపై కసరత్తు 22A నిషేధిత ఆస్తుల జాబితాలో వివాదం లేని…

Read Full News

పీఓబీ నిషేధిత భూముల జాబితా ఎవరి బాధ్యత? తహసీల్దార్లు–సబ్ రిజిస్ట్రార్ల లేఖల వ్యవహారంపై పెరుగుతున్న అనుమానాలు

తెలంగాణలో పీఓబీ (నిషేధిత) భూముల జాబితా వ్యవహారం రోజు రోజుకీ తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అసలు భూములను గుర్తించి పీఓబీ నిషేధిత జాబితా రూపొందించాల్సిన బాధ్యత ఎవరిది? రెవెన్యూ అధికారులదా? లేక సబ్ రిజిస్ట్రార్లదా? అన్న స్పష్టత లేకపోవడం వల్ల పట్టాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. 🏡 పీఓబీ జాబితా తయారీపై గందరగోళం భూములను గుర్తించి జాబితా తయారు చేయాల్సిన తహసీల్దారులే సబ్ రిజిస్ట్రార్లకు లేఖలు రాయడం విస్మయానికి గురి చేస్తోంది. వివరాలు ఇవ్వాల్సిన అధికారులు, తిరిగి…

Read Full News