‘Kareej Khata’ పేరుతో లక్షల ఎకరాలు 22Aలోకి? రైతుల భూములకు అసలు ముప్పేంటి?

తెలంగాణలో 22A నిషేధిత భూముల జాబితా మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా ‘Kareej Khata’ పేరుతో పట్టా భూములను కూడా Prohibited Properties Listలో చేర్చుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో 60 నుంచి 100 వరకు ఖాతాలు, సర్వే నంబర్లు 22A జాబితాలోకి వెళ్లిపోయాయని బాధితులు, రెవెన్యూ వ్యవస్థపై విమర్శలు చేస్తున్న వర్గాలు ఆరోపిస్తున్నాయి. భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోలేక, కొనలేక, అమ్మలేక రైతులు, భూ యజమానులు MRO, RDO కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని వారు…

Read Full News

రేవంత్ రెడ్డికి ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.. అసలు ఎందుకు? తీవ్ర ప్రశ్నలు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి కేరళలో ‘Aryadan Muhammed–2026 Best Public Servant Award’ లభించింది. సెప్టెంబర్ 25న కేరళలోని నిలంబూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఆయన స్వీకరించారు. Aryadan Muhammed Foundation ఈ అవార్డును అందించగా, ఎంపీ, AICC ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ రేవంత్ రెడ్డికి అవార్డును అందజేశారు. రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు, నాయకత్వం, ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధతను పరిగణనలోకి తీసుకుని…

Read Full News

22Aపై సీఎం కీలక ప్రకటన.. లక్షల కుటుంబాలకు ఉపశమనం దిశగా అడుగులు!

22A భూములపై ఉత్కంఠకు తెరపడిందా? సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీసిన 22A నిషేధిత భూముల అంశంపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమగ్రంగా మాట్లాడారు. నిజమైన ప్రైవేట్ ఆస్తులు నిషేధిత జాబితాలో చేరిన సందర్భాల్లో సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 22A సమస్యకు హైపవర్ కమిటీ 22Aకి సంబంధించిన భూ వివాదాలను పరిశీలించేందుకు ఉన్నతస్థాయి అధికారుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. భూ సమస్యల్లోని పలు కేటగిరీలను పరిశీలించి…

Read Full News

అసెంబ్లీ రచ్చపై తీవ్ర విమర్శలు.. ప్రజా సమస్యల కోసం సభకు రారా?

హైదరాబాద్: ప్రజా సమస్యలపై చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అసెంబ్లీ సమావేశాలు రాజకీయ రచ్చకు వేదికగా మారడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనే ఆశతో ఎదురుచూస్తున్న సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసెంబ్లీ అనేది పార్టీ సమావేశం కాదని, ప్రజల తరఫున తమ వాణిని వినిపించాల్సిన అత్యంత కీలక వేదిక అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాధనంతో నిర్వహించే అసెంబ్లీ సమావేశాలకు సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని…

Read Full News

తెలంగాణలో 22A భూముల కలకలం.. అసలు ఏంటి ఈ నిషేధిత జాబితా? లక్షల ఎకరాలపై ఎందుకీ వివాదం?

హైదరాబాద్: తెలంగాణలో గత కొంతకాలంగా భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన 22A నిషేధిత జాబితా వ్యవహారం తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఒకప్పుడు ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూములు, అసైన్డ్ ల్యాండ్స్, దేవాదాయ, వక్ఫ్ తదితర భూముల రక్షణ కోసం ఉపయోగించిన నిబంధన ఇప్పుడు సామాన్య భూయజమానులకు కూడా ఆందోళన కలిగించే అంశంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో తమకు స్పష్టమైన పట్టాలు, పాస్‌బుక్స్, పహాణీలు, రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నప్పటికీ భూములు నిషేధిత జాబితాలో కనిపిస్తున్నాయని భూయజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు….

Read Full News

మల్లంపేట చెరువు చుట్టూ అసలు కథేంటి? 192 సర్వే నంబర్ నుంచి 296 వరకు వివాదం.. HYDRAA దృష్టి పెట్టాల్సిందేనా?

మల్లంపేట చెరువులో నిర్మాణాలు ఉన్నాయా? 192 సర్వే నంబర్‌నే 296గా మార్చారా? 260 వరకే సర్వే నంబర్లు ఉన్నాయని అధికారిక రికార్డులు చెబుతున్నాయా? ఫేక్ సర్వే నంబర్ల ఆరోపణల వెనుక అసలు కథేంటి? బాధితుల ఆస్తులు FTL, బఫర్ జోన్‌లోకి ఎందుకు వెళ్లాయి? HYDRAA కమిషనర్ రంగనాథ్ ఈ వ్యవహారంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా? హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భూముల విలువ పెరుగుతున్న కొద్దీ చెరువులు, ప్రభుత్వ భూములు, FTL, బఫర్ జోన్‌లకు సంబంధించిన వివాదాలు…

Read Full News

తెలంగాణలో 22A ల్యాండ్ వివాదం.. అసలు గేమ్ ఏంటి? ఆరోపణల వెనుక నిజమెంత?

తెలంగాణలో భూముల వ్యవహారం మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. 22A జాబితా పేరుతో ప్రైవేట్ భూములు ఇబ్బందులకు గురవుతున్నాయన్న ఆరోపణలు ఒకవైపు.. 22A నుంచి భూములను తొలగించే ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయన్న అనుమానాలు మరోవైపు.. ఫేక్ గవర్నమెంట్ మెమోలు, నకిలీ పత్రాలతో భూములపై మోసాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రభుత్వ వాదనలు ఇంకోవైపు ఉన్నాయి. అసలు 22A అంటే ఏమిటి? ఈ వివాదం వెనుక ఉన్న ప్రశ్నలు ఏంటి? ప్రజలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? 22A అంటే…

Read Full News

22A జాబితాపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. వివాదం లేని భూములకు విముక్తి? ఈ వారంలోనే కొత్త లిస్ట్!

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భూములు, ఇళ్లు, ఫ్లాట్లు, ప్రైవేట్ ఆస్తులను నిషేధిత ఆస్తుల జాబితా 22Aలో చేర్చడంతో తలెత్తిన వివాదానికి త్వరలోనే పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు 22A జాబితాను సమీక్షించే ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే సవరించిన జాబితాను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సీఎం ఆదేశాలతో 22A జాబితాపై కసరత్తు 22A నిషేధిత ఆస్తుల జాబితాలో వివాదం లేని…

Read Full News

ప్రతి కుటుంబానికి ఎకరం భూమి.. కవిత సంచలన హామీ | Telangana Bhoomilakshmi Scheme

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక హామీ చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ‘భూలక్ష్మి’ పథకాన్ని ప్రతిపాదించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరం భూమి పంపిణీ చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత.. తెలంగాణలో సామాజిక న్యాయం సాధించాలంటే భూమి పంపిణీ అవసరమని అన్నారు. భూమి లేని పేద కుటుంబాలకు భూమి అందించడం ద్వారా…

Read Full News