తెలంగాణ తొలి మహిళా యూనివర్సిటీలో షూటింగ్స్ దందా?చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో భద్రతా లోపాలు, విద్యార్థినుల ఆందోళన

తెలంగాణలో తొలి మహిళా యూనివర్సిటీగా పేరుగాంచిన చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ (కోటి మహిళా కళాశాల) లో జరుగుతున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. గతంలో ఎన్నో సినిమా షూటింగ్స్ జరిగినప్పటికీ, ఎప్పుడూ కూడా కళాశాల నడుస్తున్న సమయంలో షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వలేదని పూర్వ విద్యార్థినులు స్పష్టం చేస్తున్నారు. కోటి మహిళా కళాశాల పూర్వ విద్యార్థినిగా, అలాగే అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) నాయకురాలిగా ఉన్న రోజుల్లో ఒక్క విద్యార్థినికీ అన్యాయం జరగకుండా చూసుకున్నామని…

Read Full News

తెలంగాణ ఆత్మగౌరవంపై దాడులు సహించంవిగ్రహాల నుంచి ఐడీపీఎల్ భూముల వరకు పోరాటం కొనసాగుతుంది

తెలంగాణ ప్రజలు ఇప్పటికే ఎన్నో గాయాలతో ఉన్నారని, ఆ గాయాలపై మళ్లీ పుండు మీద కారం చల్లినట్టుగా పాలకులు వ్యవహరిస్తున్నారని నేత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గాయపడ్డ ప్రజలు మార్పు కోసం కొంత శాంతన పొందాలని భావిస్తే, మరింత బాధను మిగిల్చే నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. విగ్రహాల ఏర్పాటు మాత్రమే సమస్య కాదని, అక్రమ పద్ధతుల్లో, అహంకారంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తీసుకునే నిర్ణయాలే అసలు సమస్య అని స్పష్టం చేశారు. తెలంగాణ…

Read Full News

తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్ర:రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ నిలిపివేతపై బక్క జార్సన్ సంచలన ఆరోపణలు

తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే దిశగా కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ మాజీ నేత బక్క జార్సన్ సంచలన ఆరోపణలు చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, ప్రభుత్వ ఖర్చులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇప్పటికీ సుమారు ₹11 వేల కోట్లకు పైగా బెనిఫిట్స్ బకాయిలుగా ఉన్నాయని బక్క జార్సన్ తెలిపారు. ఇవి ప్రభుత్వ దయాదాక్షిణ్యాలు కాదని, ఉద్యోగులు తమ సేవాకాలంలో కష్టపడి…

Read Full News

ఐడీపీఎల్ భూముల వివాదంపై విజిలెన్స్ ఎంక్వైరీ: కవిత–మాధవరం కృష్ణారావు మధ్య పరస్పర ఆరోపణలు

ఐడీపీఎల్ భూముల వివాదంపై విజిలెన్స్ ఎంక్వైరీ కవిత–మాధవరం కృష్ణారావు మధ్య పరస్పర ఆరోపణలు హైదరాబాద్‌లోని కోట్ల రూపాయల విలువైన ఐడీపీఎల్ భూముల వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. కూకట్పల్లి పరిధిలోని సర్వే నెంబర్ 376లో ఉన్న భూముల అన్యక్రాంతంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సమగ్ర విచారణ చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని, ఎస్పీ స్థాయి అధికారితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణల నేపథ్యంలోనే…

Read Full News

కొత్త పార్టీ నిజమేనా? కవిత రాజకీయ ప్రయాణం వెనుక వ్యూహమా, కుట్రలా? – తెలంగాణలో పెరుగుతున్న అనుమానాలు

తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న – “కొత్త పార్టీ వస్తుందా?” అనే కాదు, “ఆ పార్టీ వెనుక నిజంగా ఎవరు ఉన్నారు?” అన్నదే. ఈ సందేహాలు ముఖ్యంగా కవిత రాజకీయ భవిష్యత్తు చుట్టూ కేంద్రీకృతమవుతున్నాయి. ఒకవైపు ఆమె కొత్త రాజకీయ శక్తి గురించి మాట్లాడుతుంటే, మరోవైపు ఆమెను ఉద్దేశపూర్వకంగా దూరం పెట్టారా? లేక ఇది 2027 ఎన్నికల దిశగా వేసిన వ్యూహాత్మక అడుగేనా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొంతమంది విశ్లేషకుల…

Read Full News

అసెంబ్లీ ఎన్నికలను మించిపోయిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఖర్చు – ఓటుకు రూ.55 వేలు, రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్ల చలామణి

తెలంగాణలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలను కూడా తలదన్నేలా మారాయని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన గ్రామాల్లోనూ, జనరల్ గ్రామాలకు తీసిపోకుండా భారీగా ఖర్చు జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,728 గ్రామ పంచాయతీల్లో సుమారు 1,200 ఏకగ్రీవాలు ఉండగా, మిగిలిన దాదాపు 10 వేల పంచాయతీల్లో అన్ని పార్టీల అభ్యర్థులు కలిసి రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లు అంచనాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే, గత…

Read Full News

శంషాబాద్‌లో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్‌కు కేంద్ర ఆమోదం – లీకుల వ్యవహారం, బీజేపీ అంతర్గత విభేదాలపై కిషన్ రెడ్డి ఆగ్రహం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం రాయికొండ గ్రామంలో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఆసుపత్రి కోసం సుమారు రూ.16 కోట్ల విలువైన భూసేకరణకు కూడా అనుమతి ఇచ్చినట్లు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మాన్‌సుఖ్ మండవియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సనత్‌నగర్ ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నాచారం, రామచంద్రపురం, సిర్పూర్ కాగజ్‌నగర్, వరంగల్ ప్రాంతాల్లో ఈఎస్ఐ ఆసుపత్రులు కార్మికులకు వైద్య సేవలు…

Read Full News

విద్య పేరుతో మరో 30 వేల కోట్ల అప్పా? మూడో విడత పంచాయతీ పోలింగ్ నడుమ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై విమర్శలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా విద్యారంగ అభివృద్ధి కోసం రాష్ట్రానికి 30 వేల కోట్ల రూపాయల రుణం అవసరమని కేంద్రాన్ని కోరినట్లు ఈరోజు పలు పత్రికల్లో ప్రధాన వార్తగా ప్రచురితమైంది. అదే సమయంలో ఈరోజు (17వ తేదీ) మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగడం రాజకీయంగా కీలక ఘట్టంగా మారింది. ఇప్పటికే జరిగిన తొలి రెండు విడతల పోలింగ్‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సంఖ్యలో పంచాయతీలను కైవసం చేసుకున్న నేపథ్యంలో,…

Read Full News

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ–ఎస్సీ–ఎస్టీ ఐక్యతే లక్ష్యం : బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ బై శేఖర్

గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చైతన్యంతో తమ ఓటును తమ వారికే వేయాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ బై శేఖర్ పిలుపునిచ్చారు. బాల్గొని బాలరాజ్ గౌడ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8168 గ్రామాల్లో ఎన్నికలు జరగగా, అందులో 811 గ్రామాల్లో ఏకగ్రీవ ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఈ ఏకగ్రీవ స్థానాలను ఆధిపత్య వర్గాలు వేలంపాటలుగా మార్చి, లక్షల నుంచి కోట్ల రూపాయల…

Read Full News

పోలీసులు స్పందించకపోతే మేమే డ్యూటీ చేయాల్సి వస్తుంది: రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక

రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా పోలీస్ యంత్రాంగానికి మరోసారి హెచ్చరిక చేస్తున్నామని రాజకీయ నేతలు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినప్పటికీ, రాష్ట్రంలో అరాచక పరిస్థితులు కొనసాగుతున్నాయని తీవ్ర విమర్శలు చేశారు. నల్లగొండ జిల్లాలో మల్లయ్య యాదవ్ హత్య ఉదంతాన్ని గుర్తు చేస్తూ, మొదటి విడత పోలింగ్‌కు ముందే దుర్మార్గంగా హత్య జరిగిందని ఆరోపించారు. అంతేకాకుండా నల్లగొండ నియోజకవర్గంలో ఓ బీసీ సోదరుడిని నామినేషన్ వేయొద్దంటూ బెదిరించి, దాడి చేసి, చివరకు కిడ్నాప్ చేసి…

Read Full News