తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ప్రారంభం.. ప్రమాణ స్వీకారంలో త్రిష స్పెషల్ అట్రాక్షన్
తమిళనాడులో 60 ఏళ్ల తర్వాత డీఎంకే-అన్నాడీఎంకేలకు అతీతంగా కొత్త రాజకీయ శకం ప్రారంభమైందనే చర్చ జరుగుతోంది. తమిళగా వెట్రి కళగం (టీవీకే) అధినేత చంద్రశేఖరన్ జోసెఫ్ విజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ విజయ్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించగా, ఆయన క్యాబినెట్‌లో మరో తొమ్మిది…

