బేగంపేటలో భూముల కబ్జా ఆరోపణలు.. సర్పంచ్‌లు, రాజకీయ నేతలపై మాజీ సర్పంచ్ కుటుంబం సంచలన ఆరోపణలు
సంగారెడ్డి జిల్లా కంది మండలం బేగంపేట గ్రామంలో గ్రామ కంఠం భూముల కబ్జాపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఓకే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ సర్పంచ్ కుటుంబ సభ్యులు, గతంలో పేదలకు కేటాయించిన భూములను ఫోర్జరీ పద్ధతుల్లో ఆక్రమించారని ఆరోపించారు. తమ సంతకాలను నకిలీగా ఉపయోగించి హౌస్ నంబర్లు, రికార్డులు మార్చి కోట్ల రూపాయల విలువైన భూములను కొందరు అనుచరుల పేర్లపై నమోదు చేశారని తెలిపారు. మాజీ సర్పంచ్ బాబు గౌడ్ మాట్లాడుతూ 20 ఎకరాలకు…

