రేమత్ నగర్ ప్రజల ఆవేదన.. డ్రైనేజీ, తాగునీరు, రోడ్ల సమస్యలతో నిత్యం నరకయాతన.. కార్పొరేటర్‌పై తీవ్ర అసంతృప్తి
హైదరాబాద్ నగరంలోని రేమత్ నగర్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న పౌర సమస్యలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తాగునీటి సరఫరా, డ్రైనేజీ లీకేజీలు, దెబ్బతిన్న రోడ్లు, పారిశుద్ధ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. 24 గంటలూ కారుతున్న డ్రైనేజీ రేమత్ నగర్‌లో ప్రధాన సమస్య డ్రైనేజీ వ్యవస్థేనని స్థానికులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రెండు…

