మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీలిమిటేషన్తో కలపొద్దు, విడిగా ఆమోదించండి: విపక్షాల డిమాండ్
పార్లమెంట్ సమావేశాలు ముగియడానికి మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో కీలక బిల్లులపై ఉత్కంఠ నెలకొంది. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, FCRA తదితర బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వ వ్యూహంపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఇప్పటికే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు మద్దతు తెలిపిన నేపథ్యంలో, దాన్ని డీలిమిటేషన్ బిల్లుతో ముడిపెట్టకుండా ప్రత్యేకంగా ప్రవేశపెట్టి ఆమోదించాలని విపక్షాలు కోరుతున్నాయి. మహిళలకు చట్టసభల్లో మరింత ప్రాతినిధ్యం కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్…

