సెంట్రింగ్ కార్మికుల పోరాటానికి మద్దతు.. “మేస్త్రీ హటావ్, సెంట్రింగ్ బచావ్” నినాదాలతో దీక్ష
హైదరాబాద్లో సెంట్రింగ్ కార్మికులు, కాంట్రాక్టర్లు చేపట్టిన దీక్ష రాజకీయ, కార్మిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. “జై తెలంగాణ.. జై సెంట్రింగ్” నినాదాలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం జరిగింది. వేదికపై సెంట్రింగ్ యూనియన్ నాయకులు, కాంట్రాక్టర్లు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు హైదరాబాద్లో కనిపించే భారీ అద్దాల భవనాల నిర్మాణంలో సెంట్రింగ్ కార్మికుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. “మేము లేకపోతే ఆ భవనాలే…

