బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) సీజన్ 17 తాజా ఎపిసోడ్‌లో పాల్గొన్న చిన్నారి ప్రవర్తన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్‌కు చెందిన ఐదవ తరగతి విద్యార్థి ఐషద్ భట్ తన అతి ధైర్యం మరియు ఆత్మవిశ్వాసంతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
గేమ్ ప్రారంభించే ముందు అమితాబ్ బచ్చన్ రూల్స్ వివరించబోతుండగా, ఆ బాలుడు “తనకు ఇప్పటికే రూల్స్ తెలుసు” అంటూ మధ్యలోనే అడ్డుకుని ప్రశ్నలు ప్రారంభించమని కోరాడు. మొదటి నాలుగు ప్రశ్నలకు ఆప్షన్స్ చెప్పకుండానే సమాధానాలు చెప్పి అమితాబ్‌ను ఆశ్చర్యపరిచాడు. అయితే రామాయణంకు సంబంధించిన ఐదవ ప్రశ్న వద్ద తడబడి, తప్పు సమాధానం చెప్పి గేమ్ నుంచి అవుట్ అయ్యాడు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో, నెటిజన్లు రెండు వర్గాలుగా విభజమయ్యారు. కొందరు పిల్లాడి ప్రవర్తనను “అహంకారంగా” పేర్కొంటూ, తల్లిదండ్రుల పెంపకం పద్ధతిని తప్పుపట్టారు. మరోవైపు సింగర్ చిన్మయి శ్రీపాద మాత్రం పిల్లాడిని ట్రోల్ చేస్తున్న నెటిజన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “పిల్లలు చిన్నపాటి తప్పు చేస్తే వారిపై ఇంత ద్వేషం ఎందుకు చూపిస్తున్నారు? నిజమైన సమస్యలప్పుడు మాత్రం ఎవరూ మాట్లాడరేంటి?” అంటూ ప్రశ్నించారు.
ఈ ఘటనతో ఆధునిక పిల్లల ప్రవర్తన, తల్లిదండ్రుల పెంపకం, సోషల్ మీడియాలో పిల్లలపై జరుగుతున్న విమర్శల దుష్ప్రభావం వంటి అంశాలు మళ్లీ చర్చకు వచ్చాయి.

