ఓటుకు సుక్క–ముక్క, రూ.1000–2000… అసెంబ్లీలా సాగుతున్న సర్పంచ్ ఎన్నికలు: అభ్యర్థుల గిఫ్టుల పోటీకి గ్రామాలు హాట్‌స్పాట్

తెలంగాణ సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. “ఓటుకు సుక్క–ముక్క… రూ.1000–2000” అనే మాట గ్రామాల్లో ఓపెన్‌గా వినిపిస్తోంది. ఏ ఎన్నిక వచ్చినా, ఉపఎన్నికైనా, సర్పంచ్ ఎన్నికైనా… డబ్బు, మద్యం, మాంసం ఇప్పుడు సాధారణమైపోయింది. రాజకీయ నాయకులు కూడా దీన్ని అలవాటు చేసుకుని పూర్తిగా ఓన్ చేసుకున్నట్లే కనిపిస్తున్నారు.

▪️ రూ.1000 నుంచి రూ.2000 వరకు ఓపెన్ రేట్లు

ఎన్నికల ముందు రోజు గ్రామాల్లో ప్రలోభాల హడావుడి పీక్‌కు చేరింది.

  • కొందరు అభ్యర్థులు ఓటుకు ₹1000–₹2000
  • మగవారికి క్వార్టర్ బాటిల్
  • ఇంటికింటికి చికెన్, మటన్ ప్యాకెట్లు

అని ఓపెన్‌గా పంపుతున్నట్లు గ్రామాల్లో ప్రచారం.

వలసలు వెళ్లిన ఓటర్లను తిరిగి రప్పించేందుకు ప్రత్యేక బస్సులు, కార్లు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అంతేకాదు, పలు గ్రామాల్లో “ఓటింగ్ అయిపోయాక ప్రయాణ ఖర్చు ఇస్తాం” అంటూ మౌఖిక ఒప్పందాల టాక్ వినిపిస్తోంది.

6,500 రూపాయల జీతం కోసం కోట్ల ఖర్చా?

సర్పంచ్‌కు నెల జీతం కేవలం ₹6,500 మాత్రమే. వార్డ్ మెంబర్‌కు జీతమే లేదు.
అయినా, అభ్యర్థులు:

  • ₹50 లక్షలు
  • ₹70 లక్షలు
  • ₹1 కోటి
  • ₹1.5 కోట్లు

ఖర్చు పెట్టడానికి సిద్ధం అవుతున్నారు.

అప్పుడు ప్రశ్న ఇదే:

6,500 జీతం కోసం కోట్ల ఖర్చు ఎందుకు?

దానికి ఒక్కటే సమాధానం:

“కబ్జాలు, లేఅవుట్లు, గ్రామ నిధుల దుర్వినియోగం… ఇవే అసలు లక్ష్యాలు.”

ఒక అభ్యర్థి కోటి ఖర్చు చేస్తే, అతని ఆలోచన ఇలా ఉంటుంది

  • “ఈ కోటికి కనీసం 3–5 కోట్లు రాబట్టాలి.”
  • గ్రామ నిధులు, రోడ్లు, డ్రైనేజ్ పనుల్లో కిక్‌బ్యాక్‌లు
  • భూములపై కబ్జా అవకాశాలు
  • స్థానికంగా అథారిటీని డబ్బుగా మార్చుకోవడం

అదే అసలు గేమ్.

రేపు నీ ఇల్లు కూడా కబ్జా కావచ్చు” — ఓటర్లకు హెచ్చరిక

గ్రామాల్లో పెద్దవాళ్లు కూడా చెబుతున్నారు:

ఇప్పుడు 2000 తీసుకుని ఓటు వేస్తే… తర్వాత నీ ఇల్లు, నీ పొలం, నీ పథకాలు కూడా వాళ్ల చేతిలో ఇరుక్కుంటాయి.

ఓటర్లు స్వయంగా డబ్బులు తీసుకున్నా, చివరికి నష్టపోయేది ప్రజలేననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి

4236 గ్రామాల్లో రేపే పోలింగ్

రాష్ట్రవ్యాప్తంగా 4236 గ్రామాల్లో రేపు సర్పంచ్–వార్డ్ మెంబర్ ఎన్నికలు జరగనున్నాయి.
ఈసీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పినప్పటికీ… గ్రామాల్లో జరిగే ఓపెన్‌లో కొనుగోలు, లిక్కర్ సప్లై, గిఫ్ట్‌లు ఈసీ దృష్టికి రాకపోవడం ప్రజల్లో ప్రశ్నలు రేకెత్తిస్తోంది

▪️ “ఈసీ మళ్లీ నిద్రపోతుందా?” — విమర్శలు

ఉపఎన్నికలో ఫేక్ ఓట్లు, రిగ్గింగ్, ఫిర్యాదులపై చర్యలు తీసుకోలేదని ఇప్పటికే విమర్శలు వచ్చాయి.

ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఓపెన్‌గా:

  • “1000 పంపుతున్నారు”
  • “చికెన్ పంపారు”
  • “లిక్కర్ ఇవ్వబోతున్నారు”

అని సోషల్ మీడియాలో, గ్రామాల్లో ప్రచారం జరుగుతున్నప్పటికీ…
ఎలక్షన్ కమిషన్ ఎందుకు స్పందించడం లేదు?
అనే ప్రశ్నలు మళ్లీ మళ్లీ వినిపిస్తున్నాయి.

గ్రామాల్లో ఎలక్షన్ హీట్ టాపు

సార్వత్రిక ఎన్నికల రేంజ్‌లోనే:

  • గిఫ్ట్‌లు
  • రహస్య ఒప్పందాలు
  • వలస ఓటర్ల షిఫ్టింగ్
  • ఒక్క రాత్రి స్పెషల్ కురచలు

తో పల్లెల్లో ఎన్నికల హడావిడి పీక్‌కి చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *