పిక్‌టాక్‌ : మత్తెక్కించే చూపులతో చంపేస్తోంది… రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ షో వైరల్

కెరటంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్‌ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కెరీర్ ప్రారంభంలో చిన్న హీరోలు, చిన్న సినిమాలతో ప్రయాణం మొదలుపెట్టిన ఈ అందాల నటి ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ క్షణం తీరిక లేకుండా బిజీ అయింది. ఒక దశలో స్టార్ హీరోల సినిమాలకు సైతం డేట్లు లేవని చెప్పే స్థాయికి ఆమె క్రేజ్ చేరింది.

అయితే రకుల్ కెరీర్‌ను చాలామంది గాలి బుడగతో పోలుస్తుంటారు. ఒక్కసారిగా పెరిగిన స్టార్‌డమ్, అదే వేగంతో తగ్గిపోయింది. టాలీవుడ్‌లో మూడు నాలుగేళ్లు టాప్ హీరోయిన్‌గా కొనసాగిన రకుల్‌కు ఆ తర్వాత కనీస ఆఫర్లు కూడా రావడం కష్టంగా మారింది. కొండపొలం తర్వాత తెలుగులో ఆమెకు సరైన సాలిడ్ పాత్ర దక్కలేదు. హిట్ సినిమా వచ్చి కూడా చాలా కాలమే అయింది.

టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గడంతో రకుల్ మెల్లగా బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అక్కడ మంచి అవకాశాలు వచ్చినా అదృష్టం కలిసి రాక సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఒకటి రెండు సినిమాలు పర్వాలేదనిపించినా మొత్తంగా చూస్తే ఆమె కెరీర్ గాడి తప్పినట్టే కనిపిస్తోంది.

అయితే అందం విషయంలో మాత్రం రకుల్ ఇప్పటికీ కొత్త హీరోయిన్స్‌కు గట్టి పోటీ ఇస్తోంది. సోషల్ మీడియాలో తరచూ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మేకప్ మిర్రర్ ముందు నిలబడి మత్తెక్కించే చూపులతో ఫోజ్ ఇచ్చిన రకుల్ అందాలు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి.

బ్లాక్ కలర్ ఔట్‌ఫిట్, లూజ్ హెయిర్, సింపుల్ మేకోవర్‌తో ఆమె ఇచ్చిన క్లీవేజ్ షో ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. “ఇప్పటికీ హీరోయిన్‌గా నటించే అర్హత రకుల్‌కు ఉంది” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

కన్నడ సినిమా గిల్లితో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రకుల్, తెలుగులో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో తొలి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో నాన్నకు ప్రేమతో, రామ్ చరణ్‌తో బ్రూస్ లీ, అల్లు అర్జున్‌తో సరైనోడు వంటి సినిమాలతో టాప్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ సమయంలో టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది.

ఇప్పుడు కెరీర్ కాస్త నెమ్మదించినా, పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగేందుకు రకుల్ సిద్ధంగా ఉంది. ఇలాంటి గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ మళ్లీ తన పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *