ప్రముఖ హీరోయిన్ ఆషికా రంగనాథ్ ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్‌లతో తన అందాన్ని ప్రదర్శిస్తూ నెట్టింట హీట్ పెంచుతోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా మరో ఫోటోషూట్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఆషికా.
ఈసారి బ్లూ కలర్ లెహంగాలో దర్శనమిచ్చిన ఆషికా రంగనాథ్, తన కాటుక కళ్లతో కుర్రకారును మాయ చేసింది. సింపుల్ లుక్‌లోనే గ్లామర్ ఒలకబోస్తూ మెస్మరైజ్ చేసిన ఈ బ్యూటీ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అతి తక్కువ మేకప్‌తో కూడా తన సహజమైన అందంతో అభిమానులను ఆకట్టుకోవడంలో ఆషికా మరోసారి సక్సెస్ అయ్యింది.
ప్రస్తుతం ఆషికా రంగనాథ్, మాస్ మహారాజా రవితేజతో కలిసి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో రవితేజకు ఫ్రెండ్ క్యారెక్టర్‌లో కనిపించనుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌లో ఆషికా తన గ్లామర్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేసింది. మునుపెన్నడూ లేని విధంగా మరింత బోల్డ్‌గా, గ్లామర్‌గా కనిపిస్తూ అభిమానులను మాయ చేస్తోంది.
ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలని ఆషికా రంగనాథ్ కూడా ఎంతో ఈగర్‌గా ఎదురు చూస్తోంది. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ను మరింత వేగంగా చేస్తూ, సోషల్ మీడియాలో తన అందంతో హీట్ పెంచుతోంది ఈ ముద్దుగుమ్మ.
ఈ సినిమాలో రవితేజ, ఆషికా రంగనాథ్‌తో పాటు డింపుల్ హయతి కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. కిషోర్ కే తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
ఆషికా రంగనాథ్ సినీ ప్రస్థానాన్ని చూస్తే, కన్నడ చిత్రం ‘అమిగోస్’ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, ‘నా సామిరంగా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. 2016లో ‘క్రేజీ బాయ్’ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె, ‘రాంబో 2’, ‘మదగజ’, ‘రేయ్మో’ వంటి చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించింది. గ్లామర్‌తో పాటు నటనలోనూ మెప్పించిన ఆషికా, తెలుగు మాత్రమే కాకుండా తమిళంలోనూ సినిమాలు చేస్తూ తన మార్కెట్‌ను విస్తరించుకుంది.
ఒకవైపు సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే, మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామర్‌తో అభిమానులను కట్టిపడేస్తోంది ఆషికా రంగనాథ్. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ ఫోటోషూట్ నెట్టింట ట్రెండ్ అవుతూ మరోసారి ఆమె క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో చాటుతోంది.

