బాక్సాఫీస్ రారాజు ప్రభాస్.. తొలి రోజే ‘ది రాజా సాబ్’ సంచలనం.. ఎన్నో కోట్లు వసూలు!

ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెరపడింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా జనవరి 9న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన ఈ హరర్ కామెడీ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొల్పగా, అవే అంచనాలను తొలి రోజే నిజం చేసింది.

చాలా కాలం తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న పూర్తి స్థాయి హరర్ కామెడీ కావడంతో ఫ్యాన్స్‌లో భారీ క్రేజ్ నెలకొంది. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. కొన్ని చోట్ల మిశ్రమ స్పందన ఉన్నప్పటికీ, థియేటర్లలో మాత్రం మొదటి రోజే భారీ హంగామా కనిపించింది.

అంతేకాదు, తొలి రోజే రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమాను కలెక్షన్ల పరంగా వెనక్కి నెట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ప్రభాస్ గత చిత్రాలైన సలార్, కల్కి మొదటి రోజు రికార్డులను కూడా ఈ సినిమా బ్రేక్ చేసినట్లు సమాచారం.

నివేదికల ప్రకారం, ‘ది రాజా సాబ్’ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో కలిపి ఈ సినిమా మొత్తం కలెక్షన్లు ప్రస్తుతం రూ.54.15 కోట్లకు పైగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ గణాంకాలు ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినాను మరోసారి రుజువు చేస్తున్నాయి.

మారుతి దర్శకత్వం వహించి, రచించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, బోమన్ ఇరానీ, జరీనా వాహబ్ కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా వింటేజ్ ప్రభాస్ కామెడీ టైమింగ్, లుక్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.

మొత్తానికి తొలి రోజే సంచలనం సృష్టించిన ‘ది రాజా సాబ్’, రాబోయే రోజుల్లో బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు సృష్టిస్తుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *