ఇంటర్ విద్యలో భారీ మార్పులు.. 2026-27 నుంచి కొత్త పరీక్షా విధానం అమలు

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో భారీ మార్పులు రాబోతున్నాయి. 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్త పరీక్షా విధానాన్ని అమలు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో కేవలం పుస్తక జ్ఞానం కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్, విశ్లేషణాత్మక ఆలోచన, సృజనాత్మకత పెంచే దిశగా ఈ సంస్కరణలు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటి వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ప్రధానంగా థియరీ పరీక్షలకే ప్రాధాన్యం ఉండేది. కానీ ఇకపై సైన్స్ విభాగాల్లో ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాక్టికల్ పరీక్షలను ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తున్నారు. ప్రాక్టికల్స్‌కు ప్రత్యేకంగా మార్కులు కేటాయించనున్నారు. థియరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్‌కు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మార్పులు చేపడుతున్నారు.

మరోవైపు మ్యాథ్స్ సబ్జెక్టులో కూడా కీలక మార్పులు తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు 75 మార్కుల థియరీ ఉండగా, దాన్ని 60 మార్కులకు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన మార్కులను “యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్” ద్వారా కేటాయించనున్నారు. అంటే విద్యార్థులు చేసే ప్రాజెక్టులు, యాక్టివిటీస్, ప్రాక్టికల్ ఆధారిత పనులపై మార్కులు ఇవ్వనున్నారు.

ఇకపై ఇంటర్ పరీక్షల్లో మొత్తం 100 మార్కుల వ్యవస్థ కొనసాగినా, అందులో కేవలం 80 మార్కులకే థియరీ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. మిగిలిన 20 మార్కులు ప్రాక్టికల్స్, అసైన్మెంట్లు, యాక్టివిటీస్ ఆధారంగా ఇవ్వనున్నారు. ముఖ్యంగా భాషా విభాగాల్లో కూడా 20 మార్కులను ఇంటర్నల్ అసైన్మెంట్లకు కేటాయించే ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం.

ప్రాజెక్టులు, సెమినార్లు, అసైన్మెంట్లు, ఏడాది పొడవున విద్యార్థుల పనితీరు ఆధారంగా మార్కులు కేటాయించనున్నారు. దీంతో విద్యార్థులపై పరీక్షల ఒత్తిడి కొంతవరకు తగ్గే అవకాశం ఉందని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ సంస్కరణలు జాతీయ విద్యా విధానం (NEP) కు అనుగుణంగా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం బట్టీ పద్ధతి కాకుండా, విద్యార్థుల్లో ఆలోచనా శక్తి, విశ్లేషణాత్మక దృష్టి, సృజనాత్మకత పెంపొందించడమే లక్ష్యంగా ఈ మార్పులు ఉండనున్నాయి.

అయితే ఈ కొత్త విధానం విద్యార్థులకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? ప్రాక్టికల్స్, యాక్టివిటీస్ ఆధారిత మూల్యాంకనం నిజంగా ఫలితాన్నిస్తుందా? అనే దానిపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

మరిన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *