Chandana R

గ్రేటర్ హైదరాబాద్ విభజన… మూడు కార్పొరేషన్ల ఏర్పాటు, స్పెషల్ ఆఫీసర్ల నియామకం

గ్రేటర్ హైదరాబాద్ నగర పరిపాలనలో కీలక మార్పులకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR) పరిధిని మూడు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో హైదరాబాద్ పరిపాలనను మరింత వికేంద్రీకరించాలనే లక్ష్యంతో కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చింది. ఈ పునర్వ్యవస్థీకరణలో భాగంగా హెచ్ఎండిఏ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జెఎస్ రంజన్‌ను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. జిహెచ్ఎంసి కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్ కొనసాగుతుండగా,…

Read Full News

ముద్రా లోన్ పేరుతో సైబర్ మోసం… వరంగల్‌కు చెందిన ఐదుగురు యువకుల అరెస్ట్

ముద్రా లోన్ ఇప్పిస్తామని చెప్పి మహిళను మోసం చేసిన కేసులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఐదుగురు యువకులను హైదరాబాద్ సిసిఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. జాబ్ సెర్చింగ్‌లో భాగంగా సైబర్ నేరస్తులతో పరిచయం ఏర్పడి, చివరికి వారే సైబర్ మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ గత ఏడాది నవంబర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో లోన్స్‌కు సంబంధించిన ప్రకటనను చూసింది. మరుసటి రోజు గుర్తు తెలియని…

Read Full News

హాస్టల్ సమస్యలపై విద్యార్థినుల ఆందోళన… రాత్రంతా రోడ్లపై ధర్నా, డైరెక్టర్ రాజీనామా డిమాండ్

హాస్టల్‌లో ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం, అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహంతో విద్యార్థినులు రాత్రంతా రోడ్లపై ఆందోళన చేపట్టారు. నిన్న రాత్రి సుమారు 9 గంటల నుంచి ఉదయం వరకు హాస్టల్ ముందు విద్యార్థినులు ధర్నా కొనసాగించారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. విద్యార్థినుల వివరాల ప్రకారం, ఒక విద్యార్థిని తల్లిదండ్రులు హాస్టల్‌కు వచ్చినప్పటికీ లోపలికి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. హాస్టల్ నిబంధనల్లో పేరెంట్స్‌కు అనుమతి లేదని చెప్పి తిరస్కరించారని ఆరోపించారు. గెస్ట్‌గా వచ్చిన తల్లిదండ్రులకు…

Read Full News

మూసి పునర్జీవానికి కీలక ముందడుగు… 50 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్, టిడిఆర్ పరిహారంపై సందేహాలు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసి పునర్జీవ ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. మూసి నది పునరుద్ధరణ, పరివాహక ప్రాంతాల అభివృద్ధి కోసం 50 ఎకరాల భూసేకరణ చేపట్టాలని మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) నిర్ణయించింది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ బుధవారం జారీ అయింది. హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ బాపుఘాట్ వరకు 9.2 కిలోమీటర్లు, ఉస్మాన్ సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 11.8 కిలోమీటర్ల పరిధిలో భూములను సేకరించనున్నారు….

Read Full News

సంగారెడ్డిలో పోలీసులపై దుర్భాషలు… జగ్గారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో జరిగిన ఘటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలీస్ సిబ్బందిపై దుర్భాషలాడారని ఆరోపణలు రావడంతో వివాదం మరింత ముదిరింది. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు, హోమ్ గార్డులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ శాఖలో 26 సంవత్సరాలు సేవలందించిన ఓ మాజీ అధికారి మాట్లాడుతూ, విధుల్లో ఉన్న అధికారులను అవమానించే విధంగా మాట్లాడటం బాధాకరమని తెలిపారు….

Read Full News

ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ దే పైచేయి… మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విడుదలైన ఎగ్జిట్ పోల్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం ఐదు మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఉండొచ్చని అంచనా వేయబడింది. కాంగ్రెస్‌కు 68 నుంచి 76 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, బీఆర్ఎస్‌కు 29 నుంచి 36 స్థానాలు, బీజేపీకి 3 నుంచి 5 స్థానాలు, ఎంఐఎంకు ఒక స్థానం వచ్చే అవకాశముందని సర్వే వెల్లడించింది. అలాగే 8 నుంచి 14 స్థానాల్లో గట్టి…

Read Full News

పోలింగ్ కేంద్రంలో పోలీసులపై ఎంపీ అరవింద్ ఆగ్రహం… కేసు నమోదు, పలు చోట్ల ఎన్నికల ఉద్రిక్తత

మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిజామాబాద్‌లో పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులపై పరుష పదజాలంతో మాట్లాడిన బీజేపీ ఎంపీ ధర్మపూర్ అరవింద్‌పై కేసు నమోదైంది. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిని బెదిరిస్తూ దూషించారని ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకున్నట్లు నిజామాబాద్ వన్‌టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. బుధవారం పోలింగ్ సందర్భంగా 287వ పోలింగ్ బూత్ వద్ద బీజేపీ అభ్యర్థిని పోలీసులు బయటకు పంపారన్న సమాచారం తెలుసుకున్న ఎంపీ అరవింద్ అక్కడికి చేరుకున్నారు….

Read Full News

వికారాబాద్ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా… కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: టౌన్ ఇన్‌స్పెక్టర్

వికారాబాద్ పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని టౌన్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుండగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. వికారాబాద్ పట్టణంలోని 34 వార్డుల్లో ప్రస్తుతం 32 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్థానిక సిబ్బందితో పాటు అదనపు బలగాలను కూడా వినియోగించి పోలింగ్ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని…

Read Full News

ఎన్నికల వ్యవహారంపై ఆగ్రహం… అధికారులపై అభ్యంతరాలు, దౌర్జన్య ఆరోపణలు

ఎన్నికల నిర్వహణలో అధికారుల వ్యవహారంపై కొందరు ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని, చెప్పినా స్పందన లేకపోవడం వల్ల ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఏజెంట్ల వ్యవహారం, పోలింగ్ నిర్వహణ, చెక్‌లు, పర్యవేక్షణలో పారదర్శకత లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ప్రక్రియలో నిబంధనలు సమానంగా అమలు కావాలని, ప్రజల అభ్యంతరాలను సీరియస్‌గా తీసుకోవాలని స్థానికులు…

Read Full News

మున్సిపల్ ఎన్నికలకు భారీ భద్రత… కోట్ల నగదు, మద్యం, మాదకద్రవ్యాలు స్వాధీనం

రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు బుధవారం జరగనున్న పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల బందోబస్తు, వెబ్‌కాస్టింగ్ విధానం, భద్రతా చర్యలపై మంగళవారం డీజీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో భారీగా అక్రమ నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, బంగారం-వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం రూ.1.29 కోట్ల నగదు, రూ.1.21 కోట్ల విలువైన మద్యం, రూ.15 లక్షల విలువైన మాదకద్రవ్యాలు,…

Read Full News