News
రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు
ఎనిమిది వారాల్లో చెల్లింపులు చేయాలని స్పష్టం తెలంగాణలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 13న దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కమిషన్, ఎనిమిది వారాల లోపు అర్హులైన రిటైర్డ్ ఉద్యోగులకు వారి బకాయిలను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు పిటిషనర్ తెలిపారు. అలాగే, మరణించిన ఉద్యోగులు, వారి కుటుంబాలు మరియు పిటిషన్ దారులకు పూర్తి వివరాలు తెలియజేయాలని కూడా ఆదేశించినట్లు వెల్లడించారు….
పాలకుర్తిలో కాంగ్రెస్‌కు అత్తా–కోడళ్ల బెడద..?
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, జాన్సీ రెడ్డిపై అసంతృప్తి నేతల ఫిర్యాదు పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆ పార్టీ అసంతృప్తి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త జాన్సీ రెడ్డి వ్యవహార శైలే ఇందుకు కారణమని ఆరోపిస్తూ, తక్షణమే పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల ఓటమికి ఇదే ప్రధాన కారణమని అసంతృప్తి వర్గం ఆరోపిస్తోంది….
రాజకీయాలకే పరిమితమవుతున్న పాలన.. మున్సిపల్ ఎన్నికలు, అంతర్జాతీయ పరిణామాలపై విమర్శలు
రాజకీయ నాయకులు ఎన్నికలపై పూర్తి దృష్టి పెట్టి పాలనను విస్మరిస్తున్నారని విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా, ఓటర్ జాబితా సవరణకు మరో రెండు రోజుల గడువు మాత్రమే మిగిలి ఉంది. వార్డు వారీగా తుది ఓటర్ జాబితాను ఈ నెల 12న ప్రకటించనుండగా, 16న పోలింగ్ కేంద్రాల వారీ జాబితా విడుదల కానుంది. ఎన్నికలన్నింటినీ ఒకేసారి పూర్తి చేయాలనే తొందరలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీనివల్ల పరిపాలనపై ప్రభావం పడుతోందని ప్రతిపక్షాలు…
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల్ని తిప్పి పంపకూడదు – కఠిన రిఫరల్ సిస్టంపై సర్కార్ కసరత్తు
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చిన ఏ రోగినైనా ఇకపై “సౌకర్యాలు లేవు”, “కేసు సీరియస్” అనే కారణాలతో తిప్పి పంపేందుకు వీలు ఉండదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేయనుంది. రోగి పరిస్థితి ఎలా ఉన్నా ఆసుపత్రి గడప తొక్కిన వెంటనే అడ్మిట్ చేయాల్సిందే అన్న నిబంధనను అమల్లోకి తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పటిష్టమైన రిఫరల్ సిస్టం అమలుపై అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు చేసే అంశంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర…
ప్రశ్నించని ప్రజలే పాలకుల బలం..! తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎటు పోతుంది?
హాయ్ హలో అందరికీ నమస్తే…ఇది రాజకీయ విమర్శ కాదు – ఇది ఒక సాధారణ పౌరుడి ప్రశ్న. ఈరోజు మనం చూస్తున్న మీడియా, రాజకీయాలు, పాలన అన్నీ కలిపి చూస్తే ఒకే విషయం స్పష్టంగా అర్థమవుతుంది – ప్రజా సమస్యలు వార్తలే కావడం లేదు. ఎవరు ఎవరిని తిట్టారు, ఎవరు ఎవరిపై కామెంట్ చేశారు అన్నదే హెడ్‌లైన్. కానీ రోడ్లు, నిరుద్యోగం, జీతాలు, రైతుల సమస్యలు మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. నాలుగో స్థంభం ఎవరికి పనిచేస్తోంది? నిష్పక్షపాతంగా…
అనగనగా ఒక రాజు ట్రైలర్.. పండగ వైబ్‌తో నవీన్ షో!
నవీన్ పొలిశెట్టి లీడ్ రోల్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో మారి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా అనగనగా ఒక రాజు. ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే టీజర్ ఇంకా సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసిన అనగనగా ఒక రాజు సినిమా నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అనగనగా ఒక రాజు ట్రైలర్ చూస్తే ఇది పక్కా పండగ వైబ్…
భాగ్యశ్రీ వా… వారెవా..! అఖిల్ ‘లెనిన్’లో పాటతోనే హింట్
ఆంధ్రా కింగ్ తాలూకా తర్వాత భాగ్య శ్రీ బోర్స్ చేస్తున్న సినిమా లెనిన్. అక్కినేని హీరో అఖిల్ హీరోగా చేస్తున్న ఈ సినిమాను మురళి కిషోర్ డైరెక్ట్ చేస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి తొలి సాంగ్ వా వారెవా రిలీజైంది. సాంగ్ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో అలా ఇన్ స్టంట్ హింట్ అయ్యింది. ఈమధ్య వరుస సినిమాలతో థమన్ దూసుకెళ్తున్నాడు….
చిరు – వెంకటేష్ స్పెషల్ ఇంటర్వ్యూ.. హోస్ట్ ఎవరో తెలుసా?
చిరు – వెంకటేష్ కాంబోలో స్పెషల్ ఇంటర్వ్యూ.. హోస్ట్ ఎవరంటే?టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలుగా మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ పేరు సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రంలో వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా చిరంజీవి,…
సచిన్ ఇంట పెళ్లి బాజాలు! అర్జున్ టెండూల్కర్ పెళ్లి డేట్ ఫిక్స్
సచిన్ ఇంట పెళ్లి బాజాలు.. అర్జున్ టెండూల్కర్ పెళ్లి డేట్ ఫిక్స్!భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమారుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన ప్రియురాలు, వ్యాపారవేత్త అయిన సానియా చందోక్‌ను ఆయన వివాహం చేసుకోనున్నాడు. కొంతకాలంగా వీరి పెళ్లి గురించి ప్రచారం జరుగుతున్నప్పటికీ, తాజాగా వివాహ తేదీలు ఖరారైనట్లు సమాచారం. ఈ ఏడాది మార్చిలో వీరి వివాహ వేడుక జరగనుంది. తాజాగా…
సంక్రాంతి వేళ బస్ చార్జీల మోత..! నాలుగు నుంచి ఐదు రెట్లు పెంచిన ప్రైవేట్ ట్రావెల్స్
సంక్రాంతి వేళ బస్ చార్జీల మోత.. సామాన్యుడికి పండగ ప్రయాణం భారంగా మారిందా? సంక్రాంతి పండగ వచ్చిందంటే సొంత ఊళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలనే ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ ఈసారి ఆ ఆనందాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు పూర్తిగా మింగేశాయన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. పండగ సీజన్‌ను అవకాశంగా మార్చుకున్న ప్రైవేట్ ట్రావెల్స్.. బస్ టికెట్ చార్జీలను మూడు, నాలుగు రెట్లు కాదు.. కొన్ని రూట్లలో ఐదు రెట్లు వరకు పెంచేశాయి….

