News
సింగరేణి కార్మికుల హక్కులపై బీఆర్ఎస్ ఫైర్.. కోల్ బ్లాక్స్, ఐటీ పర్క్స్, డిపెండెంట్ ఉద్యోగాలపై కేంద్ర-రాష్ట్రాలకు అల్టిమేటం
సింగరేణి కార్మికుల సమస్యలు, తెలంగాణ బొగ్గు బ్లాకుల కేటాయింపు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై బీఆర్ఎస్ నాయకత్వం తీవ్ర విమర్శలు గుప్పించింది. తెలంగాణలోని గోదావరి వ్యాలీలో ఉన్న కోల్ బ్లాకులన్నీ సింగరేణికే కేటాయించాలని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డిని బహిరంగంగా డిమాండ్ చేశారు. తెలంగాణ భూమి నుంచి వెలికితీసే బొగ్గు తెలంగాణ ప్రజలకే, ముఖ్యంగా సింగరేణి కార్మికుల భవిష్యత్తుకు ఉపయోగపడాలని పేర్కొన్నారు. ఈ డిమాండ్ కొత్తది కాదని, 2014లో పార్లమెంటులో బొగ్గు బిల్లుకు సవరణలు చేసిన…
ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీకి చెక్ పడుతుందా? రేవంత్ సర్కార్ కొత్త రూల్స్ నిజంగా అమలవుతాయా?
నమస్తే… వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రతి ఏడాది జూన్ నెల వచ్చిందంటే మధ్యతరగతి కుటుంబాల్లో మొదలయ్యే అతిపెద్ద టెన్షన్ ఏంటంటే పిల్లల స్కూల్ ఫీజులు. అడ్మిషన్ ఫీజు, ట్యూషన్ ఫీజు, బుక్స్ ఫీజు, యూనిఫామ్ ఫీజు, ట్రాన్స్‌పోర్ట్ ఫీజు… ఇలా పేర్లు మారుతున్నాయి కానీ తల్లిదండ్రుల జేబులపై పడే భారం మాత్రం తగ్గడం లేదు. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
ప్రభుత్వ దవాఖానల్లో రూ.100 కోట్ల మెడికల్ కిట్ల స్కామ్? పేదల ప్రాణాలతో చెలగాటమా?
సాధారణంగా ప్రభుత్వ దవాఖాన అంటే పేదవాడికి చివరి ఆశ. జేబులో రూపాయి లేకపోయినా ప్రాణాలు కాపాడే చోటుగా ప్రభుత్వ ఆస్పత్రులను ప్రజలు నమ్ముతారు. కానీ అదే పేదవాడి నమ్మకాన్ని కొందరు అవినీతి రాబందులు సొమ్ము చేసుకుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలంగాణలో వెలుగులోకి వస్తున్న తాజా పరిణామాలు చెబుతున్నాయి. తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGMSIDC)లో ఏకంగా రూ.100 కోట్ల విలువైన మెడికల్ కిట్లు, మందుల టెండర్లలో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్…
మీనాక్షి నటరాజన్‌పై కుట్ర జరిగిందా? కాంగ్రెస్‌లో లీక్ చేసిన వ్యక్తి ఎవరన్న ప్రశ్నపై కేటీఆర్ సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నిజాయితీకి మారుపేరుగా గుర్తింపు పొందిన మీనాక్షి నటరాజన్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ నామినేషన్ వివాదం చుట్టూ మొదలైన ఈ రాజకీయ తుఫాన్ ఇప్పుడు కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల వరకు వెళ్లింది. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. హైదరాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశంలో ప్రసంగించిన కేటీఆర్.. మీనాక్షి నటరాజన్‌పై రాజకీయ…
ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు.. చార్జ్‌షీట్ సిద్ధం, రాజకీయ నేతలపై చర్యలుంటాయా?
నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు తుది దశకు చేరుకుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ రెండున్నరేళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో ఇప్పటికీ అసలు సూత్రధారులు ఎవరు? రాజకీయ నాయకుల పాత్ర ఎంతవరకు ఉంది? అనే ప్రశ్నలకు మాత్రం స్పష్టమైన సమాధానం రావడం లేదు. తాజాగా సిట్ దర్యాప్తు ముగింపు దశకు చేరుకుని తుది చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరోసారి ఈ కేసు హాట్ టాపిక్‌గా…
కాక్రోచ్ జనతా పార్టీ ధర్ణతో కేంద్రానికేనా షాక్? తెలంగాణ విద్యా వ్యవస్థపై కూడా లేవాల్సిన ప్రశ్నలివే!
హైదరాబాద్: నీట్, సీబీఎస్ఈ పరీక్షల పేపర్ లీకేజీలు, పెరుగుతున్న విద్యా ఫీజులు, నిరుద్యోగ యువత భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో “కాక్రోచ్ జనతా పార్టీ” పేరిట కొనసాగుతున్న ఉద్యమం ఇప్పుడు హైదరాబాద్‌కు చేరుకుంది. ఆదివారం ఇందిరా పార్క్ ధర్ణా చౌక్ వద్ద విద్యార్థులు, నిరుద్యోగ యువత, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో వరుసగా జరుగుతున్న…
5000 కాదు.. 19,000 పోలీస్ ఉద్యోగాలే కావాలి: రేవంత్ సర్కార్‌కు నిరుద్యోగుల అల్టిమేటం”
హైదరాబాద్: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువత మరోసారి రోడ్డెక్కింది. ప్రభుత్వం ప్రకటించబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న 5,000 పోలీస్ పోస్టుల నోటిఫికేషన్ తమకు సరిపోదని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మొత్తం 19,000 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “వెంటనే నోటిఫికేషన్… వెంటనే న్యాయం… వెంటనే నిర్ణయం” అంటూ నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన చేపట్టిన అభ్యర్థులు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను…
మీనాక్షి నటరాజన్‌కు కోర్టుల్లో షాక్.. రాజ్యసభ నామినేషన్ వివాదం రాజకీయ దుమారం
కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్‌కు వరుసగా న్యాయస్థానాల్లో ఎదురుదెబ్బలు తగలడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై దాఖలైన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు విచారణకు అనర్హమని పేర్కొంటూ కొట్టివేయగా, మరోవైపు నాంపల్లి కోర్టు కూడా ఇదే అంశంపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల సంఘం తీరుపై, రాజకీయ పార్టీల అంతర్గత వ్యవహారాలపై తీవ్ర చర్చ మొదలైంది….
తెలంగాణకు మళ్లీ కేసీఆర్ నాయకత్వమే అవసరం”.. సిరిసిల్లలో కేటీఆర్ భావోద్వేగ ప్రసంగం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో నిర్వహించిన పార్టీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో రాష్ట్రానికి మళ్లీ కేసీఆర్ నాయకత్వమే అవసరమని అన్నారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదని, పదేళ్ల పాటు ఆయన ఆ బాధ్యతను ఒక తపస్సులా నిర్వర్తించారని వ్యాఖ్యానించారు. సిరిసిల్ల అభివృద్ధిని ఉదాహరణగా చూపుతూ, ఒకప్పుడు నక్సలిజం, నేత కార్మికుల ఆత్మహత్యలు, సాగునీటి కొరతతో అల్లాడిపోయిన ప్రాంతం నేడు విద్య,…
కేంద్రం కీలక ఆదేశాలు: ఇకపై రీటైల్ పెట్రోల్ బంకుల్లో భారీగా డీజిల్ కొనుగోళ్లకు బ్రేక్.. 90 రోజుల నిషేధం అమలు
దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకులు, ఇంధన సరఫరా వ్యవస్థకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వాణిజ్య, పారిశ్రామిక, సంస్థాగత వినియోగదారులు సాధారణ రీటైల్ పెట్రోల్ బంకుల నుంచి భారీ మొత్తంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడానికి అనుమతి ఉండదు. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. కేంద్రం విడుదల చేసిన ఆదేశాల ప్రకారం ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుంది. రాబోయే…

