Nampally Railway Station లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్‌లో ఆగి ఉన్న హైదరాబాద్–జైపూర్ స్పెషల్ ట్రైన్‌లోని ఓ ఏసీ కోచ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
శుక్రవారం సాయంత్రం 7:50 గంటలకు బయలుదేరాల్సిన Hyderabad Jaipur Special Train లో సుమారు 6:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మొదట ఒక ఏసీ కోచ్‌లో ప్రారంభమైన మంటలు కొద్దిసేపటికే పక్క భోగీలకు వ్యాపించాయి.
మంటలు చెలరేగడాన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే ట్రైన్ నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు ప్రయాణికులు అత్యవసరంగా ట్రైన్ డోర్లు తెరిచి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా, మరికొందరు ధైర్యం చేసి ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.
ఒక ప్రయాణికుడు భోగిలోని అద్దాలను పగలగొట్టి లోపలికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. మరో ఇద్దరు ప్రయాణికులు స్టేషన్‌లో ఉన్న వాటర్ పైపుల ద్వారా మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు.
సమాచారం అందుకున్న Railway Protection Force సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాద సమయంలో కోచ్‌లో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.
ఘటనపై స్పందించిన రైల్వే అధికారులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.
శనివారం Forensic Science Laboratory బృందం పరిశీలన అనంతరం అసలు కారణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

