అక్టోబర్ తర్వాతే స్థానిక ఎన్నికలా?.. ఎస్ఐఆర్, ఓటర్ జాబితా సవరణతో తెలంగాణలో రాజకీయ వేడి

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ ప్రారంభమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా అక్టోబర్ తర్వాతే జరిగే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికలు నిర్వహించడం కష్టమనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది.

అక్టోబర్ 1 వరకు తుది ఓటర్ జాబితా లేదు

ఎన్నికల సంఘం ఇప్పటికే ఎస్ఐఆర్ షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి తిరుగుతూ సమాచార సేకరణ చేయనున్నారు. ఆ తర్వాత ముసాయిదా జాబితా విడుదల, అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన వంటి ప్రక్రియలు పూర్తి చేసి అక్టోబర్ 1న తుది ఓటర్ జాబితా విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట వంటి పలు మున్సిపాలిటీల ఎన్నికలు కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎస్ఐఆర్ పై ఫోకస్.. ఎన్నికలపై కాదు

ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియపైనే దృష్టి పెట్టింది. కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది అందరూ ఈ సర్వే నిర్వహణలో నిమగ్నమయ్యారు. ఇదే సిబ్బంది స్థానిక ఎన్నికల నిర్వహణ బాధ్యతలు కూడా చూసే పరిస్థితి ఉండటంతో ఒకేసారి రెండు ప్రక్రియలు నిర్వహించడం కష్టమని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.

రాజకీయ పార్టీలు కూడా ప్రస్తుతం ఓటర్ జాబితా ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ప్రతి పోలింగ్ బూత్‌కు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమిస్తూ ఓటర్ల వివరాలపై పర్యవేక్షణ పెంచుతున్నాయి

ఎస్ఐఆర్ పై ఫోకస్.. ఎన్నికలపై కాదు

ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియపైనే దృష్టి పెట్టింది. కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలు, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది అందరూ ఈ సర్వే నిర్వహణలో నిమగ్నమయ్యారు. ఇదే సిబ్బంది స్థానిక ఎన్నికల నిర్వహణ బాధ్యతలు కూడా చూసే పరిస్థితి ఉండటంతో ఒకేసారి రెండు ప్రక్రియలు నిర్వహించడం కష్టమని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం.

రాజకీయ పార్టీలు కూడా ప్రస్తుతం ఓటర్ జాబితా ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ప్రతి పోలింగ్ బూత్‌కు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమిస్తూ ఓటర్ల వివరాలపై పర్యవేక్షణ పెంచుతున్నాయి.

ఫేక్ ఓట్లపై పెరుగుతున్న చర్చ

గతంలో కొన్ని రాష్ట్రాల్లో వేల సంఖ్యలో ఓట్లు తొలగించబడిన ఘటనలు వివాదాస్పదంగా మారాయి. దీంతో తెలంగాణలో కూడా ఓటర్ జాబితా ప్రక్షాళన ప్రక్రియపై రాజకీయ పార్టీల్లో అప్రమత్తత పెరిగింది.

ప్రత్యేకంగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సమయంలో ఫేక్ ఓట్ల అంశం పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డబుల్ ఎంట్రీలు, ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ స్వగ్రామాల్లో ఓటు కొనసాగించడం వంటి అంశాలపై కూడా ఇప్పుడు దృష్టి సారిస్తున్నారు.

డబుల్ ఎంట్రీలపై అనుమానాలు

రాష్ట్రంలో జరుగుతున్న జనగణన, హౌస్ లిస్టింగ్ సర్వేలో కూడా కొన్ని గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయని సమాచారం. ఇప్పటికే లక్షలాది మంది సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోగా, మళ్లీ ఇంటింటికి వెళ్లే ఎన్యూమరేటర్లు అదే కుటుంబాల వివరాలు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాల కోసం హైదరాబాద్ వంటి నగరాల్లో నివసిస్తున్న వారు తమ స్వగ్రామాల్లో కూడా వివరాలు నమోదు చేయడంతో డబుల్ ఎంట్రీలు జరిగే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రాజకీయ సమీకరణాలపై ప్రభావం

ఒకవైపు ఎస్ఐఆర్, మరోవైపు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలతో ప్రధాన రాజకీయ పార్టీలు బిజీగా ఉన్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేస్తుండగా, కాంగ్రెస్, బీజేపీ కూడా తమ స్థాయిలో బూత్ స్థాయి వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు దసరా తర్వాత లేదా సంవత్సరం చివర్లో జరిగే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. ఎన్నికల సంఘం తుది నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *