‘ది పారడైజ్’ సినిమా విడుదల తర్వాత సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు కనిపిస్తున్నాయి. కొందరు సినిమా కథ, స్క్రీన్‌ప్లే, యాక్షన్ సన్నివేశాలు, మేకింగ్‌పై విమర్శలు చేస్తుంటే.. మరికొందరు మాత్రం ముఖ్యంగా హీరో నాని నటనను ప్రశంసిస్తున్నారు.
ఇదే సమయంలో సినిమాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన అంశాలు, పొట్టి శ్రీరాములు ప్రస్తావన, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయని ఒక వర్గం వ్యాఖ్యానిస్తోంది.
ఈ నేపథ్యంలో సినిమాను సినిమాలాగే చూడాలని, ప్రాంతీయ భావోద్వేగాలను రాజకీయ వివాదాలుగా మార్చకూడదని కొందరు కోరుతున్నారు.

