‘ది పారడైజ్’పై ట్రోలింగ్.. నాని నటనకు ప్రశంసలు! KCR విజువల్స్‌పై ఎందుకీ చర్చ?

‘ది పారడైజ్’ సినిమా విడుదల తర్వాత సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు కనిపిస్తున్నాయి. కొందరు సినిమా కథ, స్క్రీన్‌ప్లే, యాక్షన్ సన్నివేశాలు, మేకింగ్‌పై విమర్శలు చేస్తుంటే.. మరికొందరు మాత్రం ముఖ్యంగా హీరో నాని నటనను ప్రశంసిస్తున్నారు. ఇదే సమయంలో సినిమాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన అంశాలు, పొట్టి శ్రీరాములు ప్రస్తావన, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయని ఒక వర్గం వ్యాఖ్యానిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాను సినిమాలాగే చూడాలని, ప్రాంతీయ…

Read Full News

మంకీ బాత్‌లో కొమరం భీం గౌరవం – తెలంగాణ యోధుడి చరిత్రను గుర్తు చేసిన ప్రధాని మోదీ

దేశ ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ప్రసారమైన “మన్ కీ బాత్” కార్యక్రమంలో తెలంగాణ యోధుడు కొమరం భీంను ప్రస్తావించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మోదీ మాట్లాడుతూ — “20వ శతాబ్దం ప్రారంభంలో, బ్రిటిష్ వారి దోపిడి నుండి ప్రజలను కాపాడేందుకు ఒక యువ యోధుడు, కొమరం భీం, కేవలం 20 ఏళ్ల వయసులోనే ఉద్యమించాడు” అని పేర్కొన్నారు. ఆయన తెలంగాణ గిరిజనుల స్వాభిమాన పోరాటాన్ని గుర్తుచేసి, యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధాని మాటలతో తెలంగాణ ప్రజలు…

Read Full News