ఎల్నినో ప్రభావంతో కరువు.. ప్రజలను అప్రమత్తం చేయాలి, ప్రభుత్వ చర్యలు అవసరం
తెలంగాణతో పాటు దేశంలోని పలు రాష్ట్రాలు ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులను ఎదుర్కొనే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కరువు అనేది ఒక్కరోజులో కనిపించే విపత్తు కాదని, క్రమంగా ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. తాగునీరు, సాగునీటి కొరత, ఎండల తీవ్రత, విద్యుత్ వినియోగం పెరుగుదల వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. కరువు పరిస్థితులపై ప్రజలను అప్రమత్తం చేయడం, అవసరమైన నివారణ చర్యలు…

