Headlines

రూ.6 లక్షలకే ఇంద్రమ్మ ఇల్లు? రూ.11 లక్షల ఇంటిపై రూ.5 లక్షల సబ్సిడీ.. పేదలకు నిజంగా అందుబాటులోనా?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ఇంద్రమ్మ ఇళ్ల పథకం మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. “లక్ష ఇంద్రమ్మ ఇళ్లు” అంటూ ప్రభుత్వం భారీ ప్రచారం చేస్తుండగా, హైదరాబాద్ నగరంలో మెట్రో పిల్లర్ల నుంచి ప్రధాన కూడళ్ల వరకు ఈ పథకానికి సంబంధించిన హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకంలో నిజంగా పేదలకు ఎంత మేర ప్రయోజనం చేకూరుతుందన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యూర్ (GHMC) పరిధిలో ఇంద్రమ్మ ఇళ్ల…

Read Full News

నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహం.. జంతర్ మంతర్‌లో నిరసన, విద్యార్థులపై లాఠీచార్జ్ తీవ్ర వివాదం

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థులు, యువజన సంఘాలు చేపట్టిన భారీ నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. పార్లమెంట్ మార్చ్‌కు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగంతో పలువురు విద్యార్థులు, యువకులు గాయపడినట్లు సమాచారం. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. నిరసనకారులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్…

Read Full News

బహదూర్‌గూడ రైతులకు హైకోర్టు ఊరట.. భూముల్లో జోక్యం వద్దని ప్రభుత్వానికి ఆదేశాలు

బహదూర్‌గూడ రైతులకు హైకోర్టు మధ్యంతర ఊరట.. భూముల్లో జోక్యం వద్దని ప్రభుత్వానికి ఆదేశాలు హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలోని వివాదాస్పద భూముల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు నలుగురు రైతులకు మధ్యంతర ఊరట కల్పించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సంబంధిత భూముల్లో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే సమయంలో హైడ్రా అధికారుల తీరుపై కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని…

Read Full News

నమ్మకమే పెట్టుబడి.. 13 ఏళ్లుగా కస్టమర్ల విశ్వాసంతో ముందుకెళ్తున్న విజన్ వివికే: విజయ్ కుమార్”

విజన్ వివికే విజయం వెనుక నమ్మకమే పెట్టుబడి – 13 ఏళ్లుగా వినియోగదారుల విశ్వాసంతో ముందుకు: విజయ్ కుమార్ హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగంలో తాత్కాలిక లాభాల కంటే వినియోగదారుల విశ్వాసమే శాశ్వత విజయానికి పునాది అని విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ & ఎండీ వి. విజయ్ కుమార్ అన్నారు. మేడ్చల్‌లో ప్రారంభించిన గ్రీన్ పార్క్ విల్లాస్ ప్రాజెక్ట్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. షార్ట్‌కట్ లాభాల కోసం కాదు.. లాంగ్…

Read Full News

శంషాబాద్‌లో బుల్లెట్ ట్రైన్ భూసేకరణ వివాదం.. మహిళా రైతుల అరెస్టులు, నాన్-బెయిలబుల్ కేసులు కలకలం

శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం జరుగుతున్నట్లు చెబుతున్న భూసేకరణ మరోసారి వివాదానికి దారితీసింది. తాము దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములను కోల్పోతామనే ఆందోళనతో నిరసన చేపట్టిన రైతులను పోలీసులు అర్థరాత్రి అదుపులోకి తీసుకోవడం, మహిళా రైతులపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 650 ఎకరాల భూమిపై వివాదం బాధిత రైతుల కథనం ప్రకారం, శంషాబాద్ మండలంలోని సర్వే నంబర్లు 28, 62 పరిధిలో ఉన్న సుమారు 650 ఎకరాల భూమిని…

Read Full News

మేడ్చల్‌లో విజన్ వివికే గ్రీన్ పార్క్ విల్లాస్ ప్రారంభం.. 350 ప్రీమియం విల్లాలతో మెగా గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం

మేడ్చల్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మేడ్చల్ సమీపంలోని గిర్మాపురం వద్ద సంస్థ చైర్మన్, ఎండీ వి. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో “గ్రీన్ పార్క్” పేరుతో అత్యాధునిక గేటెడ్ విల్లా కమ్యూనిటీని ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటి మెహరీన్ పీర్జాదా ముఖ్య అతిథిగా హాజరై ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 350 ప్రీమియం డూప్లెక్స్ మరియు…

Read Full News

సోనం వాంగ్‌చుక్‌ను హీరో చేశారు’.. విద్యార్థి ఉద్యమం రాజకీయాల వైపు వెళ్తుందా? ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలపై చర్చ

విద్యా వ్యవస్థలో పెరుగుతున్న పేపర్ లీకులు, పరీక్షల పారదర్శకత, విద్యార్థుల భవిష్యత్తు వంటి అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న వేళ, లడఖ్‌కు చెందిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. వాంగ్‌చుక్‌ను నిర్బంధించి జైలుకు పంపడం వల్ల ఆయన దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందారని, ప్రభుత్వ వైఖరే ఆయనను హీరోగా మార్చిందని రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలో అవినీతికి…

Read Full News

గాంధీభవన్ చుట్టూ తిరగొద్దు.. ఆగస్టు 3 వరకు క్షేత్రస్థాయిలోనే ఉండండి: కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

గాంధీభవన్ చుట్టూ తిరగొద్దు.. ఆగస్టు 3 వరకు క్షేత్రస్థాయిలోనే ఉండండి: కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. చైర్మన్ పదవులు, పార్టీ పోస్టుల కోసం గాంధీభవన్ చుట్టూ తిరగడం మానేసి, ఆగస్టు 3 వరకు ప్రతి నాయకుడు ప్రజల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో కూర్చుని రాజకీయాలు చేయడం వల్ల పార్టీకి…

Read Full News

ఒక్క మేయర్ సీటైనా గెలుస్తారా?”.. బీజేపీ నాయకత్వంపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ అంతర్గత పరిస్థితులపై ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీశాయి. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఒక్క మేయర్ సీటైనా గెలుస్తుందా అంటూ ఆయన బహిరంగంగానే ప్రశ్నించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మీడియాతో మాట్లాడిన రాజాసింగ్.. కేవలం కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ కలిసి పనిచేస్తేనే బీజేపీ అధికారంలోకి వస్తుందని అనుకోవడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. పార్టీ బలోపేతం కావాలంటే…

Read Full News

బీఆర్ఎస్‌కు మల్లారెడ్డి ఫ్యామిలీ గుడ్‌బై? శ్రావణంలో బీజేపీలో చేరికపై జోరుగా ప్రచారం

తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఆయన కుటుంబం త్వరలోనే బీఆర్ఎస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరబోతుందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో పెద్ద ఎత్తున బీజేపీలో చేరికలు ఉంటాయని పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ అభయ్ పాటిల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మల్లారెడ్డి కుటుంబం కూడా కమలం గూటికి చేరుతుందనే ఊహాగానాలు మరింత బలపడ్డాయి. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం…

Read Full News