Headlines

ఎస్‌ఐఆర్‌పై తప్పుడు ప్రచారాలు ఆపాలి.. ప్రజల్లో అపోహలు తొలగించాలి: బీజేపీ

హైదరాబాద్/సిద్దిపేట: సిద్దిపేట జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధుల కోసం నిర్వహిస్తున్న రెండు రోజుల మహా శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందని బీజేపీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా దేశం ఎదుర్కొంటున్న పలు అంశాలతో పాటు తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న ప్రచారాలపై నాయకులకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఈ నెల 25 నుంచి తెలంగాణలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించాల్సిన…

Read Full News

తెలంగాణలో చిన్నారులపై పెరుగుతున్న లైంగిక దాడులు.. ప్రభుత్వ వైఫల్యంపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు

తెలంగాణలో చిన్నారులపై పెరుగుతున్న లైంగిక దాడులు.. ప్రభుత్వ వైఫల్యంపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు హైదరాబాద్: తెలంగాణలో చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇటీవల వికారాబాద్, నిర్మల్, ఖమ్మం జిల్లాల్లో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ ప్రభుత్వం మహిళలు, చిన్నారుల భద్రతను గాలికొదిలేసిందని ఆరోపించారు. వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలో సెల్‌ఫోన్ చార్జర్ తీసుకురావడానికి వెళ్లిన ఓ బాలికపై అత్యాచారం…

Read Full News

గోల్డ్ క్వెస్ట్ నుంచి ఇగ్నైట్ వరకు.. పేర్లు మారినా మోసం ఒక్కటే! క్యూనెట్‌పై హైదరాబాద్ పోలీసుల సంచలన వివరాలు

పేర్లు మారుతున్నాయి.. కానీ మోసం మాత్రం అదే పద్ధతిలో కొనసాగుతోందని హైదరాబాద్ పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. గోల్డ్ క్వెస్ట్, క్వెస్ట్్‌నెట్, క్యూనెట్, తాజాగా ఇగ్నైట్ ఇండీ కనెక్ట్ వెంచర్స్ పేర్లతో ప్రజలను మోసం చేస్తున్న ఒకే నెట్‌వర్క్‌పై పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. పోలీసుల ప్రకారం, మొదట గోల్డ్ క్వెస్ట్ పేరుతో ప్రారంభమైన ఈ వ్యాపారం, కేసులు నమోదవడంతో క్వెస్ట్్‌నెట్, తర్వాత క్యూనెట్ (వియాన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్), ఇప్పుడు ఇగ్నైట్ ఇండీ…

Read Full News

టీజీపీఎస్సీ భారీ నోటిఫికేషన్: ఆర్&బీ శాఖలో 49 ఏఈఈ ఎలక్ట్రికల్ పోస్టులు.. ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్!

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిరుద్యోగ ఇంజినీరింగ్ అభ్యర్థులకు మరో శుభవార్త అందించింది. తెలంగాణ రోడ్లు మరియు భవనాల శాఖ (ఆర్&బీ)లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) ఎలక్ట్రికల్ విభాగంలో మొత్తం 49 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. AMIE అర్హత కలిగిన వారు…

Read Full News

మీనాక్షి నటరాజన్ నామినేషన్ వివాదం: తెలంగాణ నుంచి సమాచారం లీకైందా? సుప్రీంకోర్టుకు కాంగ్రెస్, రాజకీయంగా కొత్త అనుమానాలు

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అత్యవసర విచారణ జరపాలని పిటిషన్ దాఖలు చేసింది. కాంగ్రెస్ వాదన ప్రకారం, మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణలో ఎలాంటి క్రిమినల్ కేసు నమోదు కాలేదని, కేవలం కోర్టు నోటీసు మాత్రమే ఉందని పేర్కొంది. అలాంటి పరిస్థితిలో నామినేషన్‌ను తిరస్కరించడం చట్టబద్ధం కాదని పార్టీ అభిప్రాయపడుతోంది. అంతకుముందు కాంగ్రెస్…

Read Full News

నీళ్ల పైపులా? పైసల పైపులా?” – ఎల్బీనగర్ డ్రైనేజ్ పనులపై తీవ్ర ఆరోపణలు, కాంట్రాక్టర్లపై ప్రజా ఆగ్రహం

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్–సరూర్‌నగర్ ప్రాంతాల్లో జరుగుతున్న డ్రైనేజ్ పైప్‌లైన్ పనులపై స్థానికుల ఆగ్రహం వ్యక్తమవుతోంది. పైపులు వేయాల్సిన కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ఇప్పటికే ఉన్న నీటి పైపులను ధ్వంసం చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. “మీకు పైపులు వేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చారా? లేక ఇరగదీయడానికి ఇచ్చారా?” అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు జరుగుతున్న ప్రాంతంలో వర్క్ ఇన్‌స్పెక్టర్లు, ఇంజినీర్లు ఎవరూ కనిపించడం లేదని, కేవలం కాంట్రాక్టర్లు మాత్రమే పనులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కొంతమంది స్థానికులు ఈ…

Read Full News

సీఎంకు కొత్త హెలికాప్టర్? నెలకు రూ.5 కోట్ల కిరాయి.. గంటకు రూ.10 లక్షల ఖర్చు – ప్రజల డబ్బుపై మరో భారం?

తెలంగాణ ముఖ్యమంత్రి వినియోగం కోసం అత్యాధునిక ఎయిర్‌బస్ H160 హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందనే వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ హెలికాప్టర్‌కు నెలకు సుమారు రూ.5 కోట్ల వరకు అద్దె, గంటకు రూ.10 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందనే సమాచారం వెలుగులోకి రావడంతో ప్రజాధన వినియోగంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న వేళ, మరోవైపు సంక్షేమ హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపణలు…

Read Full News

ఫ్యూచర్ సిటీపై ప్రశ్నల వర్షం.. ఉద్యోగాలు, రైతుల భూములపై స్పష్టత కోరుతున్న విమర్శకులు

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై మరోసారి ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుందని ప్రభుత్వం చెబుతుండగా, ఉద్యోగాల కల్పన, రైతుల భూముల స్వాధీనం, పెట్టుబడుల వాస్తవ పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని విమర్శకులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ యువతకు ఎన్ని ఉద్యోగాలు? ఫ్యూచర్ సిటీ పేరుతో ప్రపంచ స్థాయి కంపెనీలను తీసుకొస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఆ కంపెనీలు స్థానిక యువతకు ఎంత మేర ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయనే అంశంపై…

Read Full News

ఫ్యూచర్ సిటీపై రేవంత్ రెడ్డి దూకుడు.. రైతుల భవిష్యత్తుపై పెరుగుతున్న ప్రశ్నలు

ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ రెడ్డి దూకుడు.. రైతుల భవిష్యత్తుపై ప్రశ్నలు హైదరాబాద్‌కు ఆనుకుని నిర్మించబోతున్న “భారత్ ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తోంది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర భవిష్యత్తును మార్చే అభివృద్ధి నమూనాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణిస్తుండగా, మరోవైపు దీనిపై ప్రతిపక్షాలు, రైతు సంఘాలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఫ్యూచర్ సిటీ అభివృద్ధిని అడ్డుకునే…

Read Full News

లోటస్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ వివాదం.. బఫర్ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులా? నష్టపోయేది ఫ్లాట్ కొనుగోలుదారులేనా?

లోటస్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ వివాదం.. బఫర్ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులా? నష్టపోయేది ఫ్లాట్ కొనుగోలుదారులేనా? హైదరాబాద్‌లోని పటేల్ చెరువు పరిధిలో ఉన్న లోటస్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ మరోసారి వివాదంలో నిలిచింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి బఫర్ జోన్ నిబంధనల ఉల్లంఘన, అనుమతుల జారీ, సామాన్య ఫ్లాట్ కొనుగోలుదారుల భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరిగేషన్ శాఖ అభ్యంతరం.. జీహెచ్‌ఎంసీ అనుమతులు? ఆరోపణల ప్రకారం, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన భూమిలో కొంత భాగం ఇరిగేషన్ శాఖ పరిధిలోని బఫర్…

Read Full News